India vs New Zealand 1st Test Day Frist Highlights: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న‌ తొలి టెస్టులో తొలిరోజు ఆట ముగిసేసమయానికి భారత్ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోర్ చేసింది. 84 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. తొలిరోజు ఆటలో టీమిండియా యువ ఆటగాళ్లు ముగ్గురు హాఫ్ సెంచరీలతో మెరిశారు. శుభ్‌మన్‌ గిల్ (52: 93 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (75 నాటౌట్‌: 136 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా (50 నాటౌట్‌: 100 బంతుల్లో 6 ఫోర్లు)లు అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. అయిదో వికెట్‌కు అయ్య‌ర్‌తో క‌లిసి జడేజా 100కు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ (13), టెస్ట్ స్పెసలిస్ట్ ఛెతేశ్వర్‌ పుజారా (26) విఫలమయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో కైల్ జేమీసన్ 3, టీమ్ సౌథీ ఒక వికెట్ పడగొట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదుకున్న గిల్...
ఈరోజు ప్రారంభ‌మైన తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు మ‌యాంక్ అగ‌ర్వాల్, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఆచితూచి ఆడారు. రెండు బౌండరీలు బాది మంచి ఊపుమీదున్న మయాంక్.. కైల్ జెమీసన్‌ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.


Also Read: Pooja Hegde Out and Samantha In: పూజా హెగ్డే ఔట్.. సమంత ఇన్! 4 సారి మహేష్ తో జతకట్టనున్న సామ్


దాంతో భారత్ 21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో సీనియర్ చేతేశ్వర్ పుజారాతో కలిసి గిల్‌ జట్టును ఆదుకున్నాడు. చెత్త బంతులకు మాత్రమే పరుగులు చేస్తూ.. భారత స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. ఒక వైపు గిల్ ధాటిగా ఆడుతుంటే.. మరోవైపు పుజారా మాత్రం నెమ్మదిగా ఆడాడు. గిల్ బౌండరీలు బాదుతూ 81 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. 


అయ్యర్ హాఫ్ సెంచ‌రీ..
భోజ‌న విరామం త‌ర్వాత స్వల్ప వ్యవధిలో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. శుభ‌మ‌న్ గిల్‌ త‌న స్కోర్‌కు మ‌రో ఒక్క ప‌రుగు (52) జోడించి ఔట‌య్యాడు. 26 ర‌న్స్ చేసిన పుజారా క్యాచ్ అవుట‌య్యాడు. ఈ సమయంలో కెప్టెన్ అజింక్య ర‌హానే, శ్రేయ‌స్ అయ్య‌ర్‌లు ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు.


Also Read: IND VS NZ 1st Test: కివీస్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర సరికొత్త రికార్డు


అయితే 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జింక్స్ పెవిలియన్ చేరడంతో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా అండతో అయ్య‌ర్‌.. భారత స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచ‌రీ చేశాడు. కాన్పూర్ టెస్టులోనే అయ్యర్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. 


జడేజా అర్ధ శతకం..
ఒకవైపు శ్రేయ‌స్ అయ్య‌ర్‌ ధాటిగా ఆడుతుంటే.. మరోవైపు రవీంద్ర జడేజా అతడికి మంచి సహకారం అందించాడు. ఇద్దరూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. అయ్య‌ర్‌ రెండు భారీ సిక్సులు కూడా బాదాడు.


Also Read: పోస్టాఫీసు డిపాజిట్ పథకాల్లో టాప్ 5 పథకాలు..ప్రత్యేకతలు ఇవే


ఇన్నింగ్స్ చివరలో జడేజా అర్ధ శతకం చేశాడు. అయిదో వికెట్‌కు అయ్య‌ర్‌, జ‌డేజాలు భారీ భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పారు. వెలుతురు స‌రిగా లేని కార‌ణంగా తొలిరోజు ఆటలో 6 ఓవ‌ర్లు తక్కువగా పడ్డాయి. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 258 ర‌న్స్ చేసింది. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో కైల్ జేమిస‌న్ మూడు వికెట్లు పడగొట్టాడు. రెండోరోజు ఉదయం అయ్య‌ర్‌, జ‌డేజాలు చెలరేగితే.. భారత్ భారీ స్కోర్ చేయడం ఖాయమే. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి