IND vs NZ 1st Test: టీమిండియాదే బ్యాటింగ్.. అయ్యర్ అరంగేట్రం! తెలుగు ఆటగాడికి దక్కని చోటు!!
రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. టాస్ గెలిచినా భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
India Vs New Zealand 1st Test Playing 11 is Out: రెండు టెస్ట్ మ్యాచుల (Test Series) సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో కాన్పూర్‌లోని (Kanpur) గ్రీన్‌పార్క్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ (India Vs New Zealand) జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా (Team India) కెప్టెన్ అజింక్య రహానే (Captain Ajinkya Rahane) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గ్రీన్‌పార్క్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం కాబట్టి భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. ఇక యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశాడు.
రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) స్థానంలో అయ్యర్ బరిలోకి దిగనున్నాడు. గాయం కారణంగా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) దూరమవడంతో మయాంక్ అగర్వాల్‌తో (Mayank Agarwal) కలిసి శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయనున్నాడు. ఇక తెలుగు ఆటగాడు కేఎస్ భరత్‌కు నిరాశే ఎదురైంది. జింక్స్ సీనియర్ వికెట్ కీపర్ వృద్దీమాన్ సాహాకే ఓటేశాడు.
Also Read: ప్రముఖ కొరియోగ్రాఫర్‌కు కరోనా, చికిత్సకు డబ్బుల్లేక...
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్లో న్యూజిలాండ్ (New Zealand) చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. కివీస్ (Kiwis) పూర్తి బలగంతో బరిలోకి దిగుతుంటే.. భారత్ మాత్రం స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లతో యుద్ధానికి సిద్దమయింది. గత కొంతకాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్న అజింక్య రహానే.. సారథిగా జట్టును ఎలా ముందుకు నడుపుతాడన్నదే ఆసక్తికరంగా మారింది. అయితే జింక్స్ ట్రాక్ రికార్డు బాగుండడం కలిసొచ్చే అంశం. రహానే సారథ్యం వహించిన అన్ని టెస్టుల్లో భారత్ దాదాపు విజయాలు అందుకున్న విషయం తెలిసిందే.
స్పిన్ పిచ్ సిద్ధం చేయాలని బీసీసీఐ (BCCI) నుంచి కానీ, భారత జట్టు యాజమాన్యం నుంచి కానీ ఎలాంటి సూచనలు అందలేదని గ్రీన్‌పార్క్ క్యూరేటర్ శివ కుమార్ చెప్పాడు. అయినా కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరు జట్ల మధ్య ఇక్కడ జరిగిన చివరి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా జోడీ 16 వికెట్లు పడగొట్టిందంటేనే.. పిచ్‌లో ఎంత టర్న్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రెండు జట్లు స్పిన్నర్లే అస్రంగా బరిలోకి దిగుతున్నాయి. మ్యాచ్‌కు వరుణుడి ముప్పు లేదు.
Also Read: బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం, సీమకు భారీ వర్షాలు తప్పవా
తుది జట్లు:
భారత్: మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, అజింక్య రహానే (కెప్టెన్), చేటేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్.
న్యూజిలాండ్: టామ్ లాథమ్, విల్ యాంగ్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, హెన్రి నికోల్స్, టామ్ బ్లండెల్ (కీపర్), రచిన్ రవీంద్ర, కైల్ జెమీసన్, టీమ్ సౌథీ, విలియమ్ సోమర్‌విల్లె, అజాజ్ పటేల్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి