Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో మరి కొద్దిరోజులు వర్షాలు తప్పేట్టు లేవు. నైరుతి బంగాళాఖాతంలో(Bay of Bengal) ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడనుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే రాయలసీమతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇక ఇవాళ ఏర్పడనున్న అల్పపీడనం(Low Pressure) ప్రభావంతో అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 26, 27, 28 తేదీల్లో అంటే రానున్న మూడ్రోజుల్లో అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ ఏర్పడనున్న అల్పపీడనం శ్రీలంక-దక్షిణ తమిళనాడు తీరానికి చేరవచ్చు. మరోవైపు కోస్తాంధ్రలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు., ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయి. గత కొద్దిరోజులుగా కురిసిన వర్షాలతో తల్లడిల్లుతున్న రాయలసీమ ప్రజలకు భారీ వర్షాల(Heavy Rains)హెచ్చరిక ఆందోళన కల్గిస్తోంది.
Also read: Nara Lokesh slams CM Jagan: జగన్‌పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook