విరాట్ కోహ్లీ అయితే ఇమ్రాన్ ఖాన్‌కి వీపు చూపిస్తాడా ?: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
బీజేపీ నేతల విమర్శలపై తనదైన స్టైల్లో స్పందించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ
పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై అక్కడే ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాను హత్తుకున్నప్పటి నుంచి బీజేపీ నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కుంటున్న మాజీ క్రికెటర్, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇవాళ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆసియా కప్ 2018 పోటీల్లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ జట్లు మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఈ ఉత్కంఠ పోరుని ఉదాహరణగా చూపిస్తూ.. ఇవాళ మైదానంలో పాక్ ఆటగాళ్లకు టీమిండియా ఆటగాళ్లు వీపులు చూపిస్తారా అని నవజ్యోత్ సింగ్ వ్యాఖ్యానించారు. ఒకవేళ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మైదానంలోకి వచ్చి విరాట్.. నిన్ను కౌగిలించుకుంటానని అంటే విరాట్ కోహ్లీ మాత్రం ఇమ్రాన్ ఖాన్ ని హత్తుకోకుండా వీపు చూపిస్తాడా ఏంటి అంటూ బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు.