Ind vs SA T20I Second Highlights: గత మ్యాచ్‌ విజయంతో ఉత్సాహం మీద ఉన్న భారత జట్టుకు దక్షిణాఫ్రికా భారీ షాక్‌ ఇచ్చింది. గెలిచే మ్యాచ్‌ను భారత్‌ చేజార్చుకోవడంతో ప్రొటీస్‌ జట్టు విజయాన్నందుకుంది. తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవం నుంచి కోలుకుని సొంత గడ్డపై దక్షిణాఫ్రికా దీటుగా ఆడి మ్యాచ్‌ను 3 వికెట్ల తేడాతో గెలిచి నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేసింది. వరుణ్‌ చక్రవర్తి బంతులతో నిప్పులు చెరిగి ఐదు వికెట్లు పడగొట్టినా కూడా భారత్‌ ఓటమి పాలవడం తీవ్ర నిరాశకు గురి చేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Ind vs SA Highlights: దక్షిణాఫ్రికాపై భారత్‌ పంజా.. తొలి టీ20లో భారీ విజయం


గర్బా మైదానంలో ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టాస్‌ ఓడి భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్‌ పాండ్యా 45 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇదే స్కోర్‌ అత్యధికం. అక్షర్‌ పటేల్‌ (27), హైదరాబాద్‌ ఆటగాడు తిలక్‌ వర్మ (20) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా స్కోర్‌ చేయలేదు. గత మ్యాచ్‌లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన స్టార్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ మూడు బంతుల్లో ఒక్క పరుగు చేయకుండానే ఔటయ్యాడు. తెలివిగా బౌలింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా పరుగులు తీయకుండా భారత్‌ను భారీగా దెబ్బతీసింది. ఆరుగురు బౌలర్‌లలో ఒక్కరు మినహా అందరూ ఒక్కో వికెట్‌ తీశారు.


Also Read: Ind vs SA T20 Live: డర్బన్‌లో సిక్సర్లతో సంజూ సెంచరీ.. దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యం


కట్టుదిట్టమైన అతి తక్కువ స్కోర్‌కు ప్రత్యర్థిని కట్టడి చేసిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో తడబడింది. స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి తీవ్రంగా శ్రమించింది. ఒక దశలో మ్యాచ్‌ చేజార్చుకుంటుందనుకున్న సమయంలో గొప్పగా పుంజుకుని ఏడు వికెట్లు కోల్పోయి 128 పరుగులతో మ్యాచ్‌ను తన వైపునకు తిప్పుకుంది. ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు రియాన్‌ రికల్టన్‌ (13), రీజా హెండ్రిక్స్‌ (24) పర్వాలేదనిపించగా కెప్టెన్‌ మార్‌క్రమ్‌ మూడు వికెట్లకే ఔటయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు త్రిస్టన్‌ స్టబ్స్‌ అడ్డుగోడలా నిలబెట్టి చివరివరకు ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. 41 బంతుల్లో 47 పరుగులు చేసి విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. గెరాల్డ్‌ కాట్జీ (9) దూకుడైన ఆటతో విజయం ఆరు బంతులు మిగిలి ఉండగానే దక్కింది. బ్యాటర్లు విఫలమైన వేళ భారత బౌలర్లు తమ వంతు నిలబెట్టే ప్రయత్నం చేసినా చివర్లో శ్రుతి తప్పడంతో చేదు ఫలితం మిగిలింది. 


బంతితో వరుణ్‌ చక్రవర్తి విరుచుకుపడడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు వెంట వెంటనే పెవిలియన్‌ బాట పట్టారు. నాలుగు ఓవర్లు వేసిన వరుణ్‌ కేవలం 17 పరుగులు ఇచ్చి కీలకమైన ఆటగాళ్లను గ్రౌండ్‌ నుంచి పంపించేశాడు. దక్షిణాఫ్రికాను వరుణ్‌ భారీగా దెబ్బతీసినా మిగతా బౌలర్లు కూడా సహకరించకపోవడంతో భారత్‌కు నిరాశ మిగిలింది. అర్ష్‌దీప్‌ సింగ్‌ ఒక వికెట్‌ తీసినా పరుగులు మాత్రం భారీగా సమర్పించుకున్నాడు. రవి బిష్ణోయ్‌ ఒక వికెట్‌ తీశాడు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.