రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరుగుతున్న భారత్‌-వెస్టిండీస్‌ రెండో టెస్ట్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్ లో విండీస్‌ 311 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. 295/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన విండీస్‌  16 పరుగులు మాత్రమే చేసి వికెట్లను కోల్పోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆల్‌రౌండర్‌  రోస్టొన్‌ చేజ్‌ (106; 189 బంతుల్లో 8×4, 1×6) ఔటయ్యాక బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ ఆటగాడు గాబ్రియల్‌ ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లోనే క్యాచ్ ఇచ్చి డకౌట్‌ అయ్యాడు. దీంతో విండీస్‌ 101.4 ఓవర్లలో 311 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ 6 వికెట్లు తీయగా.. కుల్‌దీప్‌ యాదవ్‌ 3, అశ్విన్‌ 1 వికెట్‌ తీశారు.


కాగా తొలి ఇన్నింగ్‌ రెండో రోజు ఆటలో విండీస్‌ ఆలౌట్‌ అవడంతో ఇండియా బ్యాటింగ్‌ ప్రారంభించింది. కేఎల్‌ రాహుల్‌, పృథ్వీషా ఓపెనర్లుగా బరిలోకి దిగారు. కడపటి వార్తలందే సరికి భారత్ 16 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 4 పరుగులు చేసి ఔట్ అవ్వగా..  అర్థసెంచరీతో పృథ్వీషా (52), చటేశ్వర పుజారా (9) క్రీజులో ఉన్నారు.