Rohit sharma: ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ ఇప్పుడో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఓ రెస్టారెంట్‌కు వెళ్లి..బీఫ్ తిన్నాడని ట్రోలింగ్ జరుగుతోంది. ఇంతకీ తిన్నాడా లేదా..అసలు కధేంటి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


టీమ్ ఇండియా ( Team India ) ఆస్ట్రేలియా పర్యటన ( Australia tour ) సందర్బంగా రోహిత్ శర్మ సహా నలుగురు క్రికెటర్లు నూతన సంవత్సర సందర్బంగా ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. తిని..బిల్లు కట్టి వచ్చేసుంటే అసలు వివాదమే ఉండేది కాదేమో..మరేం జరిగింది..బిల్లు కట్టకుండా వచ్చారా..లేదే..


రోహిత్ శర్మ ( Rohit Sharma )తో పాటు రిషబ్ పంత్, శుభ్‌మాన్ గిల్, పృధ్వీ షా, నవదీప్ సైనీలను టీమ్ మేనేజ్‌మెంట్ ఐసోలేషన్‌లో ఉంచింది. అయినా సరే కాదని..న్యూ ఇయర్ పురస్కరించుకుని రెస్టారెంట్‌కు వెళ్లడం ఓ సమస్యగా మారింది. ఇక ఆ రెస్టారెంట్‌లో మన క్రికెటర్లు కూర్చున్న టేబుల్ పక్కనే ఓ ఇండియన్ ఉన్నాడు. క్రికెటర్లను చూసి..సంతోషంతో కొన్ని ఫోటోలు తీశాడు. తరువాత నేరుగా కౌంటర్‌కు వెళ్లి బిల్లు కట్టేశాడు. 


కట్టిన బిల్లు, తీసిన ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు కధ మొదలైంది. నిబంధనలకు విరుద్ధంగా బయో బబుల్ ( Bio Bubble ) దాటి రావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా దర్యాప్తుకు ఆదేశించింది. మరో  సమస్య..కట్టిన బిల్లుతో వచ్చి పడింది. ఆ బిల్లులో క్రికెటర్లు చికెన్, ప్రాన్, పోర్క్‌తో పాటు బీఫ్ కూడా తిన్నట్టు స్పష్టంగా ఉంది. అంతే..ఇంకేమైనా ఉందా..శర్మగారి అబ్బాయి బీఫ్ తిన్నాడంటూ ట్రోలింగ్ ప్రారంభమైంది. ముంబై ఇండియన్స్  ( Mumbai Indians ) జట్టుకి 5 సార్లు టైటిల్ అందించిన వడా పావ్ కింగ్ ..బీఫ్ తిన్నాడంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. రోహిత్ శర్మ నాన్‌వెజ్ తినడని..పూర్తి వెజిటేరియన్ అని కొందరు వాదిస్తున్నారు. కానీ ఆ బిల్లులో డైట్‌కోక్ మినహా ఒక్కటి కూడా వెజ్ ఐటెమ్ లేకపోవడం విశేషం.


Also read: Dale Steyn: రిటైర్మెంట్‌పై స్పందించిన స్టార్ పేసర్ డేల్ స్టెయిన్