Shaik Rasheed: భారత జట్టు అండన్ 10 ప్రపంచకప్ టైటిల్ విజేతగా ఐదవసారి నిలిచింది. అటువంటి భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నది ఓ తెలుగువాడు. గుంటూరు చెందిన ఇతడిది అతి సామాన్య కుటుంబం..ఆ వివరాలు పరిశీలిద్దాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత అండర్ 19 క్రికెట్ టీమ్ నిజంగా అద్భుతం చేసింది. వరుసగా ఐదవసారి ప్రపంచకప్ టైటిల్ గెల్చుకుంది. వెస్టిండీస్‌లో జరిగిన అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు..ఇంగ్లండ్ జట్టుతో తలపడింది. ఈ నేపధ్యంలో అండర్ 19 భారతజట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న 17 ఏళ్ల షేక్ రషీద్ గురించి తెలుసుకోవాలి. అంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన షేక్ రషీద్..ఈ ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి 50.25 యావరేజ్ కలిగి ఉన్నాడు. మొత్తం 201 పరుగులు చేయగా రెండు హాఫ్ సెంచరీలున్నాయి. కరోనా కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 94 పరుగులు, ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 50 పరుగులు సాధించాడు.


షేర్ రషీద్‌ది అతి సామాన్య కుటుంబం. గుంటూరులో సొంత ఇళ్లు కూడా లేదు. ఓ చిన్న అద్దె ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు టైటిల్ విజయంతో బీసీసీఐ (BCCI) 40 లక్షల నగదు పురస్కారం అందిస్తోంది. దీనిపై రషీద్ స్పందించాడు. అంత డబ్బు తన జీవితంలో ఎన్నడూ చూడలేదని చెప్పాడు. కొంత డబ్బుతో ఇంట్లోవారికి చిన్న ఇళ్లు కొంటానని..మిగిలిన డబ్బును తన కెరీర్ కోసం వినియోగిస్తానని చెప్పాడు. మ్యాచ్‌లకు వెళ్లే ప్రతిసారీ ఆర్ధిక ఇబ్బందులుండేవన్నాడు. డబ్బుల్లేక తన కుటుంబం పడిన ఇబ్బందులు తనకు తెలుసన్నాడు.


స్టార్ ఇమేజ్ వచ్చిందని ఎప్పటికీ అనుకోనంటున్నాడు షేక్ రషీద్.  తన జీవితం ఎక్కడ్నించి ప్రారంభమైందో తనకు తెలుసని..ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనేది కోచ్‌లు, కుటుంబసభ్యుల్నించి నేర్చుకున్నానని అంటున్నాడు. భారత సీనియర్ జట్టులో స్థానం సంపాదించడమే తన ధ్యేయమన్నాడు. ఔత్సాహిక క్రీడాకారులకు ఇచ్చే సలహా ఏంటని ప్రశ్నించినప్పుడు అత్యంత నమ్రతతో సమాధానమిచ్చాడు. సలహాలిచ్చే స్థాయికి తాను చేరుకోలేదని చెప్పాడు. అయితే కఠోన సాధన, లోపాల్ని అధిగమించడం చేస్తూ ఉండాలన్నాడు. ప్రపంచ కప్‌లో విజయం ఎన్నటికీ మర్చిపోలేనన్నాడు. 


Also read: Tata Open 2022: టాటా ఓపెన్ డబుల్స్ టైటిల్ విజేతగా బోపన్న జోడీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook