Tata Open 2022: టాటా ఓపెన్ డబుల్స్ టైటిల్ విజేతగా బోపన్న జోడీ

Tata Open 2022: టాటా ఓపెన్ టోర్నీ మెన్స్ డబుల్స్ విజేతగా బోపన్న-రామ్‌కుమార్‌ జోడి నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జోడిపై భారత స్టార్ జోడి గెలుపొందింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2022, 10:35 AM IST
Tata Open 2022: టాటా ఓపెన్ డబుల్స్ టైటిల్ విజేతగా బోపన్న జోడీ

Tata Open 2022 Final: భారత స్టార్ జోడీ రోహన్ బోపన్న-రామ్‌కుమార్‌ రామనాథన్‌.. టాటా ఓపెన్ 2022 టెన్నిస్ టోర్నీ (Tata Open 2022) విజేతగా నిలిచారు. పూణెలోని బాలేవాడి స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో వీరిద్ధరూ అద్భుతమైన ప్రదర్శన చేసి డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్నారు. ఫైనల్లో బోపన్న-రామ్‌కుమార్‌ 6-7 (10-12), 6-3, 10-6తో ల్యూక్‌ సావిల్లె-జాక్‌ ప్యాట్రిక్‌ (ఆస్ట్రేలియా)పై గెలుపొంది ట్రోఫీని  కైవసం చేసుకున్నారు. ఈ మ్యాచ్ గంటా 44 నిమిషాల పాటు సాగింది.

తొలి సెట్ కోల్పోయిన బోపన్న జోడీ (Bopanna-Ramkumar).... తిరిగి పుంజుకుని రెండో సెట్ ను గెలుచుకుంది. సూపర్‌ టై బ్రేకర్‌లో నువ్వానేనా అన్నట్లు గేమ్ నడిచింది. అయితే తొమ్మిదో గేమ్‌లో బ్రేక్‌ సాధించిన బోపన్న జోడీ ఆపై సెట్‌తో పాటు ట్రోఫీని నెగ్గింది. ఇది బోపన్నకు (Rohan Bopanna) 21వ డబుల్స్ టైటిల్.  రామ్‌కుమార్‌కు రెండోది. గత నెల అడిలైడ్‌ ఓపెన్‌లో బోపన్న-రామ్‌కుమార్‌ తొలిసారి జోడీ కట్టారు. ఆ టోర్నీలో ఫైనల్‌ చేరినా రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్నారు. టాటా ఓపెన్‌ సింగిల్స్‌ టైటిల్‌ను సౌసా (పోర్చుగల్‌) గెలుచుకున్నాడు. ఫైనల్లో అతడు 7-6 (11-9), 4-6, 6-1తో ఎమిల్‌ (ఫిన్లాండ్‌)పై గెలుపొందాడు.

Also Read: ICC U19 World Cup Final: కుమ్మేసిన కుర్రాళ్లు.. ఐదోసారి అండర్‌-19 ప్రపంచకప్‌ గెలుచుకున్న యువ భారత్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News