అందరికీ థ్యాంక్స్.. ఇక వీడ్కోలు: చివరిసారిగా కూతురితో ధోనీ
ఐపీఎల్‌లో చివరిసారిగా.. అంటూ చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియాలో పోస్టు చేశాడు.
ఐపీఎల్‌లో చివరిసారిగా.. అంటూ చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పుణె గ్రౌండ్ నుంచి ధోనీ తన కూతురు జీవాతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే సమయంలో తీసిన వీడియో ఇది.
ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్ అనంతరం పుణె మైదానంలో ధోనీ జీవాతో ఆడుకుంటూ కనిపించాడు. ఆ తర్వాత మైదానం సిబ్బందితోనూ కాసేపు గడిపాడు. అనంతరం ధోనీ తన కూతురుతో కలిసి మెట్లపై నడుచుకుంటూ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకున్న ధోనీ ‘ఈ సీజన్‌లో చివరిసారిగా పుణె డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లేందుకు జీవా నాకు కంపెనీ ఇచ్చింది. మాకు ఎంతగానో అండగా నిలిచిన పుణెకు ధన్యవాదాలు. మ్యాచ్‌ల సమయంలో మైదానం అంతా పసుపు రంగులోకి మారింది. మా ఆట మిమ్మల్ని సంతోషపెట్టిందని భావిస్తున్నా’ అని పేర్కొన్నాడు.
ధోనీసేన రెండేళ్ల విరామం తర్వాత చెన్నైలో తొలి మ్యాచ్ ఆడింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆ జట్టుకి కావేరి సెగ తగిలింది. ఈ కారణంచేత సొంతగడ్డపై ఆడాల్సిన మ్యాచ్‌లన్నీ పుణెకి తరలివెళ్లిన సంగతి తెలిసిందే.
పుణే ఆతిథ్యం ఇవ్వాల్సిన ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లను కోల్‌కతాకు మారుస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ధోనీ ఈ సీజన్‌లో పుణెకు తనదైన రీతిలో వీడ్కోలు పలికారు. టోర్నీలో భాగంగా ఈ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ - చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య తొలి క్వాలిఫైయర్ ముంబయిలోని వాంఖడే మైదానంలో జరగనుంది.