ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) టైటిల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవడం కష్టమేనని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటివరకూ ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్‌ను ఈసారైనా దక్కించుకోవాలని విరాట్ కోహ్లీ సేన ఆశగా ఎదురుచూస్తోంది. అయితే ఆర్సీబీ (Royal Challengers Bangalore)కి అంత ఈజీ కాదని మాజీ క్రికెటర్ వాన్ అంటున్నాడు. ఆ జట్టులో సమష్టిగా పోరాటం కనిపించదని, జట్టు కలిసి కట్టుగా ఆడని పక్షంలో టైటిల్ నెగ్గడం అసాధ్యమని పేర్కొన్నాడు.



 


మరోవైపు లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) చేతిలో ఓటమిపాలైనా గత విజయాల ఫలితంగా ఐపీఎల్ 2020 ప్లే ఆఫ్స్‌ (IPL 2020 Playoff)కు చేరుకుంది ఆర్సీబీ. కానీ అసలు పోరు ఇప్పుడు మొదలుకానుంది. క్రిక్ బజ్‌తో మైఖేల్ వాన్ మాట్లాడుతూ... ‘ఈసారి కూడా బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ నెగ్గుతుందని అనిపించడం లేదు. ఆ జట్టు ఆటగాళ్లు సమష్టిగా ఆడినట్లుగా కనిపించలేదు. అయితే టీ20లలో ఏదైనా జరగవచ్చు అనే విషయాన్ని మాత్రం నమ్ముతాను.



 


ఆర్సీబీ తొలి టైటిల్ కోసం వేచి చూస్తోంది. కానీ కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసినా అది అంత తేలిక కాదని గ్రహించాలి. నేను ఆటగాళ్లను బాగా గమనిస్తాను. అయితే బెంగళూరులో సమష్టిగా ఆడేతత్వం అంతగా కనిపించదు. కీలక పోరులో ఒక్క ఛాన్స్ పోగొట్టుకున్నా టైటిల్ చేజారుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న ఆటగాళ్లు బెంగళూరు జట్టులో అంతగా కనిపించరు. ఒత్తిడిలో చేతులు ఎత్తేయడం వారి బలహీనత’ అని మైఖేల్ వాన్ చెప్పుకొచ్చాడు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe