ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో ప్రాతినిథ్యం వహించే క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు (Dope Tests In IPL 2020) చేసేందుకు రంగం సిద్ధమైంది. జాతీయ డోపింగ్ నిరోధక సంఘం (NADA) ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సహా మొత్తం 50 మంది స్టార్ క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు నిర్వహించనున్నారు. Virat Kohli: ఆర్సీబీ ఆటగాళ్లకు విరాట్ కోహ్లీ వార్నింగ్ 
IPL 2020: అత్యంత ప్రమాదకర ఓపెనింగ్ జోడీ ఎవరంటే...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ, జాతీయ స్థాయి తరహాలో ఐపీఎల్‌లోనూ నిజాయితీగా ఆట జరగాలని, ఆటగాళ్లు ఎలాంటి అవకతవకలకు పాల్పడకూడదని నాడా డోపింగ్ టెస్టులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఐపీఎల్ 2020 జరిగే దుబాయ్, షార్జా, అబుదాబి వేదికలలో మూడు డోప్ నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మరో రెండు కేంద్రాలను ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసే అకాడమీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్


గతంలో తరహాలో కాకుండా ఆటగాళ్ల మూత్రం (యూరిన్)తో పాటు రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లకు డోప్ టెస్టుల కోసం ఐదుగురు సభ్యులు ఉండే మూడు టీమ్‌లను నాడా నియమించనుంది. కాగా, ఐపీఎల్ 13వ సీజన్ జరిగే సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 మధ్యకాలంలో మొత్తం విడతల్లో డోప్ టెస్టులు చేయనున్నారు. Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్