RR Vs RCB: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
ఐపీఎల్ 2020లో భాగంగా ఆర్సీబీ ( royal challengers bangalore) తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ( rajasthan royals ) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 13వ సీజన్‌లో భాగంగా శనివారం మొదటిసారిగా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.
IPL 2020: RR won the toss and bat first: న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020లో భాగంగా ఆర్సీబీ ( royal challengers bangalore) తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ( rajasthan royals ) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 13వ సీజన్‌లో భాగంగా శనివారం మొదటిసారిగా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే అబుదాబి వేదికగా తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకూ ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్ చెరో మూడు-మూడు మ్యాచ్‌లు ఆడి రెండు మ్యాచ్‌లు చొప్పున గెలిచాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టిన రాజస్థాన్ మూడో మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఓడిపోగా.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో సూపర్ ఓవర్‌లో బెంగళూరు గెలిచి మంచి ఫాంలో ఉంది.
అయితే.. అంకిత్ రాజ్‌పుత్ స్థానంలో మహిపాల్ లామ్‌రోర్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వెల్లడించగా.. తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలో దిగుతున్నట్లు బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తెలిపాడు. ఐపీఎల్ 13వ సీజన్‌లో మొదటిసారి ఈ రోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. Also read: Sushant death case: సుశాంత్‌ది హత్య కాదు: ఎయిమ్స్ బృందం