Devdutt Padikkal cricket career : దేవ్‌దత్ పడిక్కల్... IPL 2020లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( SRH vs RCB IPL match 3) జట్ల మధ్య సోమవారం జరిగిన 3వ మ్యాచ్‌లో పడిక్కల్ ఫస్ట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ ( Half century ) చేయడం ద్వారా ప్రస్తుతం క్రికెట్ ప్రియుల కళ్లలో పడిన ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్. తొలిసారిగా ఐపిఎల్‌లోకి అడుగుపెట్టిన దేవ్‌దత్ పడిక్కల్... మొట్టమొదటి మ్యాచ్‌లోనే 42 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు చేసి వచ్చీ రావడంతోనే Royal challengers Bengaluru జట్టుకి లభించిన స్ట్రాంగ్ ఓపెనర్ అనిపించుకోవడమే కాకుండా.. టీమిండియా సెలెక్టర్ల కంట్లోనూ పడ్డాడనే చెప్పుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూఏఇ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత SunRisers Hyderabad బౌలర్ భువనేశ్వర్ కుమార్ ( Bhuvaneshwar Kumar ) బౌలింగ్‌లో మొదటి ఓవర్ ఓపిక పట్టిన దేవ్‌దత్ పడిక్కల్.. రెండో ఓవర్‌లో రెండు బంతులను బౌండరీలకు పంపించాడు. ఈసారి మూడో ఓవర్లో భువి బౌలింగ్‌కి రాగా.. అతడి ఓవర్‌లోనూ ఒక బౌండరీ కొట్టాడు. ఇక 4వ ఓవర్‌లో దేవ్‌దత్ పడిక్కల్ తన బ్యాటింగ్ స్టైల్‌ని చూపించుకున్నాడు. తనలాగే సన్‌రైజర్స్ జట్టులోకి కొత్తగా వచ్చిన బౌలర్ నటరాజన్ ( Natarajan ) వేసిన ఈ 4వ ఓవర్‌లో దేవ్‌దత్ పడిక్కల్ ఏకంగా మూడు బంతులను ఔండరీలకు తరలించి స్కోర్ వేగం పెంచాడు. అలా 11వ ఓవర్‌‌లో విజయ్ శంకర్ ( Vijay Shankar ) వేసిన చివరి బంతికి ఔట్ అయిన పడిక్కల్... అప్పటివరకు అడపాదడపా షాట్స్ కొడుతూ స్కోర్ వేగం పెంచడంలో తన వంతు పాత్ర పోషించాడు. Also read : SRH vs RCB, IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బెంగళూరుని గెలిపించింది ఎవరు ?


2000 సంవత్సరం జూలై 7న కేరళలోని ఎడప్పల్‌లో జన్మించిన పడిక్కల్.. ఆ తర్వాత తన కుటుంబం కర్ణాటకకు వలస వెళ్లడంతో అక్కడే కర్ణాటక ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రికెట్‌లో మెళకువలు నేర్చుకున్నాడు. 2019లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో ( Syed Mushtaq Ali tournament ) 580 పరుగులు చేయడం ద్వారా స్పాట్‌లైట్‌లోకి వచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో 64 సగటుతో 175కిపైగా స్ట్రైకింగ్ రేట్‌తో క్రికెటర్స్ కంట్లో పడ్డాడు. 2014లో తొలిసారిగా కర్ఢాటక అండర్ -16 , అండర్ -19తో క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పడిక్కల్.. 2017లో కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో ( KPL ) బళ్లారి టస్కర్స్ తరపున ఆడాడు. ఇక్కడే తనని తాను మరింత మెరుగు పర్చుకుని 2018-19లో తొలిసారిగా కర్ణాటక రంజీ జట్టు ( Karnataka Ranji team player ) ఆటగాడిగా రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కించుకున్నాడు.


2019-20 విజయ్ హజారే ట్రోఫీలోనూ ( Vijay Hazare trophy ) పడిక్కల్ తన సత్తా చాటుకున్నాడు. టోర్నమెంట్‌లో 11 మ్యాచులు ఆడి 609 పరుగులు చేసి తానేంటో నిరూపించుకున్నాడు. 15 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 907 పరుగులు చేసి బ్యాటింగ్‌లో తన సత్తా నిరూపించుకున్నాడు. 13 లిస్ట్ ఏ మ్యాచులు ఆడిన పడిక్కల్.. అందులో 2 సెంచరీలు బాది మొత్తం 650 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా కెరీర్‌లో తాను ఆడిన ప్రతీ టోర్నమెంట్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న ఈ 20 ఏళ్ల బ్యాట్స్‌మన్‌ని ఐపిల్ 2020లో సొంత రాష్ట్రం ఫ్రాంచైజీ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal challengers Bengaluru ) జట్టే అతడిని కొనుగోలు చేసింది. Also read : 3D Player Vijay Shankar: ఒక్క బంతికి 10 పరుగులు ఇచ్చిన విజయ్ శంకర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe