SRH vs RCB, IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బెంగళూరుని గెలిపించింది ఎవరు ?

ఐపీఎల్ 2020 మూడో మ్యాచ్‌లో భాగంగా యూఏఈలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ( SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై బెంగళూరు జట్టు 10 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపిఎల్‌లో తొలిసారిగా ఆడిన దేవ్‌దత్ పడిక్కల్ ( Devdutt Padikkal ) చెలరేగిపోయాడు.

Last Updated : Sep 22, 2020, 06:51 AM IST
SRH vs RCB, IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బెంగళూరుని గెలిపించింది ఎవరు ?

దుబాయి: ఐపీఎల్ 2020 మూడో మ్యాచ్‌లో భాగంగా యూఏఈలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ( SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై బెంగళూరు జట్టు 10 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపిఎల్‌లో తొలిసారిగా ఆడిన దేవ్‌దత్ పడిక్కల్ ( Devdutt Padikkal ) చెలరేగిపోయాడు. పడిక్కల్ 42 బంతుల్లో 56 పరుగులు ( 8 ఫోర్లు ) రాబట్టి ఏడి డివిలియర్స్‌తో (AB de Villiers) ( 30 బంతుల్లో 51 పరుగులు) కలిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

సన్‌రైజర్స్ కెప్టేన్ డేవిడ్ వార్నర్ ( David Warner) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. 164 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు 19.4 ఓవర్లకే అన్ని వికెట్లను నష్టపోయి 10 పరగుల తేడాతో ఓటమి పాలైంది. Also read : Virat Kohli: ఈ మ్యాచు గెలిస్తే కోహ్లీ మరో రికార్డు క్రియేట్ చేస్తాడు

లక్ష్యఛేదనలో SunRisers Hyderabad జట్టు ఆటగాళ్లు ఆరంభంలో ధీటుగానే ఆడినప్పటికి.. జానీ బెయిర్‌స్టో ( Jonny Bairstow ) (43 బంతుల్లో 61 పరుగులు)ను బెంగళూరు బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) పెవిలియన్‌కి పంపించడంతో అప్పటివరకు స్పీడ్ పేస్‌లో కొనసాగిన మ్యాచ్‌ కాస్త ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడిపోయింది. మనీష్ పాండేతో ( 34 ) కలిసి జట్టును గెలుపు దిశగా నడిపిస్తున్నట్టు కనిపించిన బెయిర్‌స్టో ఔట్ అవడంతో మ్యాచ్ గమనం ఒక్కసారిగా మారిపోయింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విజయ్ శంకర్‌ను కూడా చాహల్ ఒకే ఒక్క బంతికే ఔట్ చేశాడు. అలా 121 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ జట్టు ఆటగాళ్లు.. 153 పరుగులకే ఆల్ ఔట్ అయ్యారు. సన్‌రైజర్స్ ఆటగాళ్లలో మిడిల్ ఆర్డర్, లో ఆర్డర్ పూర్తిగా విఫలమయ్యాయి.
  
యుజ్వేంద్ర చాహల్ ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను తీసుకోవడం ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. 4 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చిన ఉమేష్ యాదవ్ ( Umesh Yadav ) బెంగళూరు బౌలర్లలో పేలవమైన ప్రదర్శన చూపాడు. Also read : 
SRH VS RCB: సన్ రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ లో ఎవరి బలం ఎంత ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News