యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (Chris Gayle) జట్టులోకి రాగానే ఆడిన తొలి మ్యాచ్‌లోనే జట్టును విజయాల బాట పట్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో భాగంగా జరిగిన 31 మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)పై ఉత్కంఠ పోరులో 8 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab) జట్టు విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే క్రిస్ గేల్ సహజశైలికి భిన్నంగా ఆడినప్పటికీ.. అర్ధశతకంతో రాణించం గమనార్హం.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


పంజాబ్ జట్టులోకి క్రిస్‌ గేల్‌ను తీసుకోవడంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) హర్షం వ్యక్తం చేశాడు. క్రిస్ గేల్ హాఫ్ సెంచరీ (53) ఇన్నింగ్స్‌ను సచిన్ ప్రశంసించాడు. ఇలాంటి ఆటగాడిని పంజాబ్ జట్టు దూరం చేసుకుందా, గేల్ లేకుండా మీరు ముందు వెళ్లగలమని ఎలా భావించారంటూ పంజాబ్ జట్టును ప్రశ్నించేలా ట్వీట్ చేశాడు సచిన్. మరోవైపు లీగ్ దశ దాటాలంటే పంజాబ్ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ప్లే ఆఫ్స్‌కు చేరకుండానే ఇంటిదారి పట్టాల్సి వస్తుంది.



 



 


కాగా, టీ20లలో 300కు పైగా మ్యాచ్‌లు ఆడిన అనుభవం క్రిస్ గేల్ సొంతం. 13,000కు పైగా టీ20 పరుగుల చేసి ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు గేల్. అయితే 41 ఏళ్ల క్రిస్ గేల్‌ ఐపీఎల్ 2020లో లీగ్ దశలో సగం మ్యాచ్‌ల వరకు మైదానంలో కాలుపెట్టలేదు. గేల్ రాకముందు 7 మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్ గెలిచి, 6 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది పంజాబ్. తాజాగా గేల్ ఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీపై నెగ్గిన పంజాబ్ ఈ సీజన్‌లో తమ రెండో విజయాన్ని అందుకుంది. గేల్ అనారోగ్యం నుంచి కోలుకున్నాడని, బెంగళూరుతో మ్యాచ్‌లో ఎంట్రీ ఇస్తాడని పంజాబ్ జట్టు ఇటీవల ప్రకటించడం తెలిసిందే. అయితే సచిన్ ట్వీట్‌కు అర్థం ఏంటని కొందరు నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe