హైదరాబాద్‌లోని ప్రముఖ అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం (Annapurna Studios Fire accident) సంభవించడం తెలిసిందే. ఓ షూటింగ్ సెట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం (Fire accident) సంభవించిందని ప్రచారం జరిగింది. అయితే కొందరు భారీ అగ్ని ప్రమాదం జరిగిందని, ఆస్తి నష్టం ఎక్కువ జరిగిందని ప్రచారం చేశారు. అన్నపూర్ణ స్టూడియో (Annapurna Studios)లోనే బిగ్‌బాగ్ తెలుగు 4 సెట్ సైతం ఉండటం గమనార్హం. దీంతో బిగ్‌బాస్ 4 (Bigg Boss Telugu 4) సెట్‌లోనూ అగ్ని ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో తమ అభిమాన కంటెస్టెంట్‌లు ఎలా ఉన్నారోనన్న ఆందోళన వ్యక్తం అయింది. అగ్ని ప్రమాదం ఘటనపై అన్నపూర్ణ స్టూడియోస్ స్పందించింది.
అన్నపూర్ణ స్టూడియోలో అంతా బాగానే ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘ అన్నపూర్ణ స్టూడియోలో అంతా బాగానే ఉన్నారు. అయితే బయటి వ్యక్తులు చెప్పే విషయాలను, వదంతులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు. ధన్యవాదాలు అంటూ’ అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించింది. అన్నపూర్ణ స్టూడియోస్‌కు యాజమాని అక్కినేని నాగార్జున. ఆయనే ప్రస్తుతం బిగ్‌బాగ్ 4కు సైతం హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
All is well at Annapurna!
.
.
Request to refrain from spreading unconfirmed news🙏🏽— Annapurna Studios (@AnnapurnaStdios) October 16, 2020
కాగా, మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు తన భార్య అన్నపూర్ణ పేరిట 1975లో అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు. 22 ఎకరాల స్థలంలో ఉన్న ఈ స్టూడియోలో సినిమాలతో పాటు సీరియల్స్, రియాలిటీ షోల షూటింగ్ జరుగుతుంటాయని తెలిసిందే. తాజా ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని, అన్నపూర్ణ స్టూడియో అధికారికంగా వివరణ ఇవ్వడంతో టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు బిగ్‌బాగ్ 4 ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe