IPL 2020: హైదరాబాద్ జట్టుకు షాక్.. టోర్నికి మార్ష్ దూరం
ఐపీఎల్-2020 13వ సీజన్ ప్రారంభమై మూడు రోజులు గడవకముందే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ( sunrisers hyderabad) జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ 13వ సీజన్‌లో ముందే ఓటమితో ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ దూరమయ్యాడు.
Mitchell Marsh out of entire IPL 2020: దుబాయ్: ఐపీఎల్-2020 13వ సీజన్ ప్రారంభమై మూడు రోజులు గడవకముందే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ( sunrisers hyderabad) జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ 13వ సీజన్‌లో ముందే ఓటమితో ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ దూరమయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తో జరిగిన మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఆగాయం పెద్దది కావడంతో జట్టుకు దూరం అయ్యే అవకాశముందని జట్టు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఐదో ఓవర్లో బౌలింగ్ చేస్తుండగా కాలి మడమ మడత పడటంతో కిందపడి తీవ్ర నొప్పితో బాధపడ్డాడు. నొప్పి తట్టుకోలేక ఆ మ్యాచ్‌లో మిచెల్ మైదానాన్ని సైతం వీడాడు. అయినప్పటికీ మిచెల్ మ్యాచ్ లాస్ట్‌లో దిగి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఆర్‌సీబీ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. Also read: SRH vs RCB, IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బెంగళూరుని గెలిపించింది ఎవరు ?
ఈ క్రమంలో మిచెల్ మడమ నొప్పి తీవ్రంగా మారిందని.. మిగతా మ్యాచ్‌లల్లో అతను ఆడకపోవచ్చునని జట్టు వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. అయితే ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మంచి ఫాంలో ఉన్నప్పటికీ గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. అయితే అతని ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ లేదా, డేన్ క్రిష్టియన్‌ను తీసుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తున్నది. అయితే మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ లేకపోవడంతోనే.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. Also read: CSKvsRR: కరోనా నుంచి కోలుకున్న సీఎస్కే కీలక ఆటగాడు