IPL 2021 Latest News: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది టైటిల్ లక్ష్యంగా అందరి కన్నా ముందే ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్. క్వారంటైన్, కోవిడ్19 టెస్టులు లాంటి బయోబబుల్ ప్రక్రియ పూర్తి చేసుకున్న అనంతరం సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ సహా ఇతర ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ షురూ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ బుధవారం నాడు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. గతంలోని జెర్సీలకన్నా ఇది చాలా ప్రత్యేకం. ఈ జెర్సీలో సాయుధ బలగాలకు గౌరవసూచకంగా గుర్తులను ముద్రించారు. దాంతో పాటు ఫ్రాంచైజీ లోగో పై భాగంలో మూడు స్టార్స్ జెర్సీలో కనిపిస్తాయి. 2010, 2011 మరియు 2018 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ నెగ్గిందని దీనికి సంకేతంగా మూడు స్టార్స్ ఉంచారు. ఐపీఎల్ 2021(IPL 2021) ప్రాక్టీస్ ముందుగానే మొదలుపెట్టిన ధోనీ టీమ్ టైటిల్ లక్ష్యంగా కసరత్తులు చేస్తోంది.


Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో స్థిరంగా బంగారం ధరలు, పతనమైన వెండి ధరలు



చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 11 సీజన్లలో ఆరు పర్యాయాలు ఫెయిర్ ప్లే అవార్డు సొంతం చేసుకుందని తెలిసిందే. సీఎస్కే యొక్క ప్రమాణాల్ని తెలిపేందుకు గుర్తుగా భుజాల భాగంలో గోల్డ్ బ్యాండ్స్ ముద్రించారు. అది వారి స్థిర ప్రదర్శనకు సంకేతంగా చూపించారు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన తరువాత సీఎస్కే ఫ్రాంచైజీ తొలిసారిగా తమ జెర్సీని రీడిజైన్ చేసింది. నూతన జెర్సీని ఆవిష్కరిస్తూ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) వీడియో ట్వీట్ చేశాడు. 


సీఎస్కే ఫ్రాంచైజీ సాయుధ బలగాల పట్ల తమ నిబద్ధతను గతంలోనూ చాటుకుంది. వారి సేవలకు గుర్తింపుగా 2019 ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో రూ.2 కోట్ల చెక్కును బహుకరించింది. ఎంఎస్ ధోనీ  గౌరవపూర్వక లెఫ్టినెంట్ కల్నల్‌గా వ్యవహరించడం దీనికి ఓ కారణమని భావించవచ్చు. ఐపీఎల్ 2021 ఏప్రిల్ 9న ప్రారంభం కానుండగా ఏప్రిల్ 10న తమ తొలి మ్యాచ్‌లో గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్కే తలపడనుంది.


Also Read; Shreyas Iyer Injury: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ, ఐపీఎల్ 2021కు శ్రేయస్ అయ్యర్ దూరం అయ్యే ఛాన్స్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook