RR vs CSK: ఐపీఎల్‌ సెకాంఢఫ్(IPL-2021)లో మ్యాచ్ లు చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. శనివారం జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ కు షాకిచ్చింది రాజస్థాన్ రాయల్స్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెలరేగిన రుతురాజ్
మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. చెన్నై ఆటగాళ్లులో రుతురాజ్‌ సెంచరీతో చెలరేగాడు. జట్టు చేసిన 189 పరుగుల్లో అతనొక్కడే వందకొట్టాడు. డుప్లెసిస్‌ (25; 2 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి తొలి వికెట్‌కు 47 పరుగులు, మొయిన్‌ అలీ (17 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్‌)తో కలిసి మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. అతని వేగంతో జట్టు 14వ ఓవర్లో 100 పరుగులు దాటింది. గైక్వాడ్‌ 43 బంతుల్లో (6 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా ఆఖర్లో దూకుడుగా ఆడాడు. ఆఖరి బంతిని సిక్సర్‌గా బాదడంతో రుతురాజ్‌ 60 బంతుల్లో సెంచరీ సాధించాడు.


Also Read: Srikar Bharat: తెలుగు క్రికెటర్‌‌ని పొగిడిన కోహ్లీ, మ్యాక్స్ వెల్


తొలి బంతి నుంచే...
రాజస్థాన్ తొలి బంతి నుంచే దూకుడుగా ఆటడం మెుదలుపెట్టింది. లూయిస్‌ (12 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి యశస్వీ జైస్వాల్‌(Yashasvi Jaiswal) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యేకించి హాజల్‌వుడ్‌పై వీరంగమే చేశాడు. అతని రెండు ఓవర్లను (2, 5వ) జైస్వాలే ఆడి... ఆ 12 బంతుల్లో 2, 4, 0, 2, 4, 4, 0, 6, 6, 4, 6, 0 విధ్వంసంతో 38 పరుగులు పిండుకున్నాడు. అలా రాజస్తాన్‌ నాలుగో ఓవర్లలోనే 50 పరుగులు దాటేయగా... యశస్వీ 19 బంతుల్లోనే (6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీ కొట్టాడు.


ఆరో ఓవర్లో లూయిస్‌ను శార్దుల్‌ పెవిలియన్‌ చేర్చా డు. పవర్‌ ప్లేలో రాయల్స్‌ 81/1 స్కోరు చేసింది. ఏడో ఓవర్‌ తొలి బంతికి యశస్వీ విధ్వంసానికి ఆసిఫ్‌ చెక్‌ పెట్టాడు. అనంతరం కెప్టెన్‌ సామ్సన్‌ (28; 4 ఫోర్లు) , శివమ్‌ దూబే(Shivam Dube) జట్టును విజయానికి చేరువ చేశారు. దూబే 31 బంతుల్లో (2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకం చేశాడు. మూడో వికెట్‌కు ఇద్దరు 89 పరుగులు జోడించారు. సామ్సన్‌ ఔటైనా... దూబే, గ్లెన్‌ ఫిలిప్స్‌ (14 నాటౌట్‌; ఫోర్, సిక్స్‌) జట్టును విజయతీరానికి చేర్చారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook