IPL 2021: RCB వరుస విజయాలకు MS Dhoni సీఎస్కే చెక్ పెడుతుందా, ఫ్యాన్స్‌లో ఉత్కంఠ
IPL 2021 RCB vs CSK |
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో మంది టాలెంటెడ్ ఆటగాళ్లకు వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా భారత్‌కు ఏడుగురు ఆటగాళ్లు, నలుగురు విదేశీ క్రికెటర్లకు ఏర్పడే జట్లు ఆడే ఈ మ్యాచ్‌లకు దేశ క్రికెట్ అభిమానులు సైతం క్రికెటర్లకు వ్యక్తిగతంగా మద్దతు తెలుపుతారు. నేడు ఐపీఎల్ 2021లో ఓ మెగా పోరు జరగనుంది. సీజన్‌లో ఇప్పటివరకూ ఓటమి ఎరుగని జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరు కొనసాగిస్తోంది.
ముంబై ఇండియన్స్‌పై మొదలైన తమ విజయ ప్రస్థానం సీజన్‌లో నేటికి విరాట్ కోహ్లీ సేన కొనసాగిస్తోంది. మరోవైపు మూడు పర్యాయాలు ఐపీఎల్ టైటిల్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఉండటంతో ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే పోరు ఎంతో ఆసక్తిని రేపుతోంది. అభిమానులు సైతం మెగా పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి మ్యాచ్ ఓటమి తరువాత కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) సీఎస్కే జట్టుకు హ్యాట్రిక్ విజయాలు అందించాడు. ఓటమికి అర్థం తెలియనట్లుగా ఆర్సీబీకి సారథ్యం అందిస్తున్నాడు విరాట్ కోహ్లీ. వీరిద్దరూ జాతీయ జట్టుకు ఆడినప్పుడు ఎలా ఉండేదో ప్రస్తుతం వీరిద్దరూ ప్రత్యర్థులుగా బరిలోకి దిగనుండటంతో సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురుస్తోంది.
Also Read: Veda Krishnamurthy: కరోనాతో Team India క్రికెటర్ వేద కృష్ణమూర్తి తల్లి కన్నుమూత
ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. సౌతర్న్ డెర్మీ సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ అంటే ధోనీ వర్సెస్ కోహ్లీ(Virat Kohli).. మిలియన్ల సంఖ్యలో అభిమానులు ఈ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. అయితే ఒక్కరికి మద్దతు తెలపండి. అందరినీ ప్రేమించండి అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టవద్దు అని సున్నితంగా కోరుతున్న అభిమానులు సైతం ఉన్నారు.
ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు 4 మ్యాచ్‌లలో 3 విజయాలతో 6 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ రెండవ స్థానంలో ఉంది. ఇలాంటి టాప్ జట్ల మధ్య పోరు ఎప్పటికీ ప్రత్యేకమే. ఈ రెండు జట్లు సూపర్ ఫామ్‌లో ఉండటం, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ లాంటి కెప్టెన్లు ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారనుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Also Read: Jwala Gutta Wedding Photos: ఘనంగా గుత్తా జ్వాల, హీరో విష్ణు విశాల్ వివాహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook