IPL 2021: కొత్త జెర్సీలో కోహ్లీ సేన..! కారణం ఏంటో తెలుసా?
IPL 2021: ఐపీఎల్ 2021 రెండవ దశ కోసం యూఏఈలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీ టీం సెప్టెంబర్ 20 న కేకేఆర్‌తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ పోరులో కోహ్లీ సేన బ్లూ కలర్ జెర్సీ దరించి..ఆడనుంది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.
IPL 2021: యూఏఈ(UAE) వేదికగా జరిగే ఐపీఎల్ రెండో దశలో తమ మొదటి మ్యాచ్‌లో ఎరుపు రంగు జెర్సీలో కాకుండా బ్లూ కలర్ జెర్సీ(Blue Color Jersy)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) బరిలోకి దిగనుంది. రాయల్ ఛాలెంజర్స్ సెప్టెంబర్ 20 న కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో.. రెండేళ్లుగా కరోనాపై పోరాటం చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి కృతజ్ఞతగా రెడ్ జెర్సీకి బదులుగా బ్లూ జెర్సీని కోహ్లి సేన ధరించనుంది.
"కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్(Front Line Warriors) అమూల్యమైన సేవకు నివాళి అర్పించేందకు...ఫ్రంట్‌లైన్ యోధుల పీపీఈ కిట్‌ల రంగును పోలివుండే బ్లూ జెర్సీని ధరించడం ఆర్సీబీ సభ్యులుగా మాకు గర్వకారణం’ అని ట్విట్ చేసింది.
గత కొద్ది సీజన్ల నుంచి ఏదో ఒక మ్యాచ్ లో పర్యావరణం (Environment)పట్ల తమ మద్దతును తెలపడానకి ఆకుపచ్చ జెర్సీని ఆర్సీబీ ధరించేది. ఐపీఎల్ ఫేజ్-1 సమయంలో కూడా మే 3 న కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో బ్లూ జెర్సీలో కనిపించబోతున్నట్లు ఆర్సీబీ జట్టు ప్రకటించింది. కరోనా కారణంగా ఐపీఎల్ ఆర్ధవంతంగా వాయిదా పడడంతో ఇప్పుడు బ్లూ జెర్సీను ధరించనునన్నారు. అయితే ఫేజ్-1 రాయల్ ఛాలెంజర్స్ మొదటి ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. కాగా కాగా సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, సీఎస్‌కే మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ప్రారంభం కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook