Virat Kohli's Shirtless Photo: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore ) కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకడు మాత్రమే కాదు, క్రికెట్ సర్కిల్ లో  ఫిట్‌నెస్ ఐకాన్ కూడా. కింగ్ కోహ్లీ బ్యాటింగ్ తోనే ఇతరులను స్ఫూర్తి నింపటం కాదు, శరీరాకృతికి, ఫిట్‌నెస్ నిర్వహించటంలో కూడా చాలా మందిచే ప్రశంసలు అందుకుంటున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్‌సిబి (RCB) మరియు టీమిండియా (Team India) జట్లు ప్రపంచంలోని అత్యుత్తమ మరియు బెస్ట్ ఫీల్డింగ్ విభాగాలలో ఒకటిగా ఉండటానికి ప్రధాన కారణం కెప్టెన్ కింగ్ కోహ్లీ అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. 


Also Read: Inzamam Ul Haq: గుండెపోటుకు గురైన దిగ్గజ క్రికెటర్ మాజీ కెప్టెన్ ఇంజమామ్‌


యుఎఇ (UAE) లో జరుగుతున్న ఐపీఎల్ (IPL 2021) రెండవదశ లీగ్ లో వరుసగా ఓడిపోయిన ఆర్‌సిబి (RCB), చివరకు డిఫెండింగ్ ఛాంపియన్‌ల (Defending Champions)కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచి విజయం సాధించింది. ఆర్‌సిబి టీం యాజమాన్యమ మరియు ఆటగాళ్లు గెలుపుతో ఆనందంలో ఉండగా ఆర్‌సిబి జట్టు క్రికెట్ సభ్యులు స్విమ్మింగ్ పూల్ లో సేదతీరుతున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. 




ఇందులో ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫోటో (Virat Kohli Shirtless Viral Photo) మాత్రం తెగ షేర్ చేస్తూ.. కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. తలపై నల్లటి కళ్లద్దాలు, చేతికి కాస్ల్టీ వాచ్.. షర్ట్ లేకుండా టాటూ లతో ఉన్న బాడీతో ఉన్న ఆర్‌సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీ (RCB Captain Virat Kohli) ఫోటో ఒకటి తెగ వైరలవుతుంది. అంతేకాకుండా, విరాట్ కోహ్లీ బాడీ ఫిట్నెస్ గురించి కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 




Also Read: Review on GST: జీఎస్టీపై మరోసారి సమీక్ష, ఆ రెండు కమిటీల నిర్ణయమే కీలకం, పెట్రోల్ పరిస్థితి ఏంటి


ఈ సీజన్ తరువాత ఆర్‌సిబి టీం కెప్టెన్సీ నుండి తొలగనున్నట్లు కోహ్లీ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఐపిఎల్ 2021 యుఎఇలో (UAE) తిరిగి ప్రారంభమైనప్పటి నుండి కోహ్లీ ఇప్పటికే మూడు మ్యాచ్‌లలో రెండు అర్ధ సెంచరీలు సాధించి, అత్యుత్తమ ఆటను తీరును కనబరుస్తున్నాడు. 




కింగ్ కోహ్లీ ఆర్‌సిబి ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ మరింత దూకుడుగా ఉండాలని బెంగళూరు ఫ్రాంచైజీ కోరుకుంటుందని దక్షిణాఫ్రికా మాజీ (Former South Africa) మరియు ఆర్‌సిబి పేస్‌మెన్ డేల్ స్టెయిన్ (RCB paceman Dale Steyn) పేర్కొన్నారు. జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా కింగ్ కోహ్లీని అలానే దూకుడుగా చూడాలని కొరుకుంటున్నారు. ఇలా ఉంటేనే కోహ్లీ సరళముగా పరుగులు చేయగలడు. కోహ్లీ దూకుడు తనం జట్టులో యువ ఆటగాళ్లకు కొత్త ఎనర్జీ ఇస్తుంది మరియు చాలా మంది యువ ఆటగాళ్లు విరాట్ పట్ల ఎంతో గౌరవాన్ని కలిగి ఉన్నారు, ఎంత గానో ఆరాధిస్తారని" స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ డగౌట్‌లో మాట్లాడుతూ స్టెయిన్ అన్నారు.


Also Read: Bypolls Schedule: హుజూరాబాద్, బద్వేల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి