Senstational Catch: ఐపీఎల్ 2022లో ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్‌లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. వాస్తవానికి అద్భుతమనేది చాలా చిన్న పదమేమో..ఆ ఆటగాడి ప్రదర్శన ముందు. లెట్స్ హ్యావ్ ఎ లుక్...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరుస ఓటములతో సతమతమై..విమర్శలకు లోనైనా చెన్నై సూపర్‌కింగ్స్ తానేంటో చూపించింది. నాలుగు ఓటముల అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయంతో సత్తా చాటింది. ఎందుకంటే నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి..216 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్ది ఆర్సీబీకు అందించింది. శివమ్ దూబే, రాబిన్ ఊతప్పల అద్భుతంగా రాణించి..సిక్సర్లు, ఫోర్లతో మోతెక్కించారు. అటు బౌలింగ్‌లో కూడా సీఎస్కే ప్రదర్శన బాగుంది. 23 పరుగుల తేడాతోనే గెలిచినా..ప్రత్యర్ధి జట్టులో 9 మంది వికెట్లు పడగొట్టగలికారు సీఎస్కే బౌలర్లు. 


ఇక ఫీల్డింగ్ విషయానికొస్తే నిజంగా అత్యధ్భుతమే జరిగింది. అసలు అది సాధ్యమేనా అన్పించింది. అసలా క్యాచ్‌ను ఎలా పట్టగలిగాడనేది ఇప్పటికీ నమ్మశక్యం కావడం లేదు ఎవరికీ. అదే హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడు సూపర్బ్ సెన్సెషనల్ క్యాచ్. అంబటి రాయుడు ఆ క్షణంలో డేగలా మారినట్టున్నాడు. రవీంద్ర జడేజా 16వ ఓవర్ అది. షార్ట్ గుడ్ లెంగ్త్ బాల్ వేశాడు. అటు ఆర్సీబీ ఆటగాడు ఆకాష్ దీప్ షార్ట్ కవర్ ఏరియా వైపు ఆడాడు. అంతే..ఆ బాల్‌కు దాదాపు 6 అడుగుల దూరంలో ఉన్న అంబటి రాయుడు ఒక్కసారిగా డేగలా ఎగిరాడు. మనిషి పూర్తిగా పడుకుని ఉండేట్టు అడ్డంగా గాల్లో ఎగిరాడు. గ్రౌండ్‌కు 2 అడుగుల ఎత్తులో గాలిలో లేచి..తన కుడిచేతిని ముందుకు చాచి..ఒక్క చేత్తో డేగలా క్యాచ్ పట్టేశాడు. ఆ క్యాచ్ చూసి అందరూ చాలాసేపటి వరకూ తేలుకోలేకపోయారు.



ఫుల్ లెంగ్త్ డ్రైవ్ చేస్తూ..ఒక్క చేత్తో పట్టిన అద్బుతమైన క్యాచ్. అనితర సాధ్యమైన క్యాచ్‌ను పట్టిన అంబటి రాయుడిని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆ క్యాచ్ అసలు ఎలా పట్టగలిగావంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 


Also read: Viral Poster: మొన్న డేటింగ్..ఇప్పుడు పెళ్లి..అన్నీ ఆర్సీబీతోనే లింక్..వైరల్ అవుతున్న మరో అమ్మాయి పోస్టర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook