IPL 2022 auction latest updates: విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని రీటేన్ చేసుకుంటున్న RCB
RCB to retain Virat Kohli and Glenn Maxwell: ఐపిఎల్ 2022 టోర్నమెంట్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ మాజీ కెప్టేన్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ సేవలు వినియోగించుకోవాలని భావిస్తోంది. అందుకే ఐపిఎల్ 2022 వేలం కంటే ముందుగానే ఈ ఇద్దరు ఆటగాళ్లను రీటేన్ చేసుకోవాలని చూస్తోందట.
RCB to retain Virat Kohli and Glenn Maxwell: ఐపిఎల్ 2022 టోర్నమెంట్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ మాజీ కెప్టేన్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ సేవలు వినియోగించుకోవాలని భావిస్తోంది. అందుకే ఐపిఎల్ 2022 వేలం కంటే ముందుగానే ఈ ఇద్దరు ఆటగాళ్లను రీటేన్ చేసుకోవాలని చూస్తోందట. విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టేన్సీ బాధ్యతలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. కొత్త కెప్టేన్ ఎంపిక విషయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
ఐపిఎల్‌లో పలు సీజన్లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ తనని తాను నిరూపించుకున్నాడు. ఐపిఎల్ 2021 సీజన్‌లో విరాట్ కోహ్లీ 405 పరుగులు రాబట్టాడు. అందుకే వచ్చే ఐపిఎల్ సీజన్‌లో కెప్టేన్ ఎవరైనప్పటికీ (IPL 2022 RCB captain).. బ్యాటింగ్ లైనప్ బాధ్యతలు మాత్రం విరాట్ కోహ్లీనే చూసుకుంటాడనే టాక్ వినిపిస్తోంది. ఐపిఎల్ 2021 లో విరాట్ కోహ్లీనే అత్యధిక పారితోషికం అందుకున్న క్రికెటర్‌గా ఖ్యాతి గడించాడు. అవును.. గత ఐపిఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ రూ.17 కోట్ల పారితోషికంతో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎర్నింగ్ ఆటగాడిగా నిలిచాడు.
విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబి డివిలియర్స్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పడంతో ఇక అతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రీటేన్ చేసుకునే అవకాశం లేకపోయింది. డివిలియర్స్ ఎలాగు లేడు కనుక అతడి స్థానంలోనే గ్లెన్ మ్యాక్స్‌వెల్ (RCB to retain Glenn Maxwell) పేరు ఖరారు చేసుకుని ఉండొచ్చు. ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also read : Team India : దక్షిణాఫ్రికాలో కరోనా విజృంభణతో టీమ్ ఇండియా పర్యటనపై అనుమానాలు
గ్లెన్ మ్యాక్స్‌వెల్ సత్తా ఉన్న ఆల్ రౌండర్ ఆటగాడు. ఐపిఎల్ 2021 సీజన్‌లో మ్యాక్స్‌వెల్ 513 పరుగులు సాధించాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని సొంతం చేసుకోవడం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం అతడికి రూ. 14.25 కోట్లు పారితోషికం చెల్లించింది. ఐపిఎల్ రూల్స్ బుక్ (IPL rules book) ప్రకారం ఐపిఎల్ ఫ్రాంచైజీలు ప్రతీ ఏడాది తమ జట్టులోంచి నలుగురు ఆటగాళ్లను రీటేన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ నలుగురిలో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు.
ఐపిఎల్ ఫ్రాంచైజీలు తమ జట్లు రీటేన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరనే వివరాలు వెల్లడించేందుకు బిసిసిఐ (BCCI latest updates) నవంబర్ 30 వ తేదీ వరకు గడువు విధించింది. ఈ ఏడాది ఐపిఎల్ ఫ్రాంచైజీలలో కొత్తగా లక్నో, అహ్మెదాబాద్ జట్లు (Lucknow franchise and Ahmedabad franchise) వచ్చి చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపిఎల్ ఆడుతున్న జట్లు తాము రీటేన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటిస్తే.. ఆ తర్వాత ఐపిఎల్ 2022 వేలం (IPL 2022 auction) నిర్వహించే లోపే మిగతా ఆటగాళ్లలోంచి లక్నో, అహ్మెదాబాద్ జట్లు ఒక్కో జట్టు ముగ్గురు ఆటగాళ్ల చొప్పున ఎంపిక చేసుకునేందుకు వీలు ఉంది. కొత్త జట్లు ఎంపిక చేసుకునే ముగ్గురు ఆటగాళ్లలో ఇద్దరు ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్‌కి అవకాశం ఉండగా.. మరొక విదేశీ ఆటగాడికి ఛాన్స్ దక్కుతుంది.
Also read : IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. టీమిండియాకు ధీటుగా కివీస్! తేలిపోయిన భారత బౌలర్లు!!
Also read : Rakhi Sawant Comments: ఈ నటి విరుష్క జంటకు కండోమ్ గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుందట.. ఎందుకంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook