IPL New Teams 2022: ఐపీఎల్​ సందడి షురూ.. టోర్నీలోకి కొత్తగా లక్నో, అహ్మదాబాద్​ టీమ్స్​

IPL New Teams 2022: ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​)లో కొత్త ఫ్రాంఛైజీలను సొంతం చేసుకునేందుకు (IPL New Team Auction) కార్పొరేట్​ సంస్థలు రూ.వేల కోట్లు కుమ్మరించాయి. లక్నో జట్టు కోసం ఆర్పీఎస్జీ గ్రూప్‌ రూ.7,090 కోట్లు.. అహ్మదాబాద్‌ ఫ్రాంఛైజీ కోసం సీవీసీ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ రూ.5,625 కోట్లు చెల్లించాయి. ఇలా కేవలం రెండు జట్లకే కలిపి రూ.12 వేల కోట్లకు (BCCI Income From IPL) పైగా రావడం విశేషం. దీంతో వచ్చే ఏడాది పది టీమ్స్​ ఐపీఎల్​ ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2021, 09:17 AM IST
    • ఐపీఎల్​ కొత్త టీమ్స్​ను ప్రకటించిన బీసీసీఐ
    • లక్నో, అహ్మదాబాద్​ ఫ్రాంఛైజీలకు భారీ ధర
    • కొత్త టీమ్స్​ను సొంతం చేసుకున్న ఆర్పీఎస్​జీ, సీవీసీ కంపెనీలు
IPL New Teams 2022: ఐపీఎల్​ సందడి షురూ.. టోర్నీలోకి కొత్తగా లక్నో, అహ్మదాబాద్​ టీమ్స్​

IPL New Teams 2022: ఐపీఎల్​లో వచ్చే ఏడాది రెండు కొత్త ఫ్రాంఛైజీలు చేరనున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ టీమ్స్​కు సంబంధించి సోమవారం బిడ్డింగ్​ (IPL New Team Auction) జరిగింది. రెండు కొత్త ఫ్రాంఛైజీల కోసం ఆర్పీ-ఎస్జీ వెంచర్స్‌ లిమిటెడ్‌, ఇరెలియా కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (సీవీసీ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌) ఈ మొత్తం చెల్లించి లక్నో, అహ్మదాబాద్‌ ఫ్రాంఛైజీలను సొంతం చేసుకున్నాయి. లక్నో ఫ్రాంఛైజీ కోసం ఆర్పీఎస్జీ గ్రూప్‌ అత్యధికంగా రూ. 7090 కోట్ల బిడ్‌ వేయగా.. అహ్మదాబాద్‌ కోసం ఇరెలియా కంపెనీ రూ. 5625 కోట్ల బిడ్‌ వేసింది. ఈ బిడ్డింగ్​ ద్వారా బీసీసీఐకి మరో రూ. 12,715 కోట్లు (BCCI Income From IPL) జమ అయ్యాయి. ఫ్రాంఛైజీ సొంతం చేసుకునేందుకు బీసీసీఐ రూ. 2000 కోట్లను కనీస వేలంగా వెల్లడించింది. దీనికి ఆర్పీఎస్జీ 350 శాతం, సీవీసీ 250 శాతం అధికంగా బిడ్‌ వేయడం విశేషం.

క్రికెట్​ విలువ ఇదే..

"ఐపీఎల్‌లో వచ్చే సీజన్‌ నుంచి రెండు కొత్త జట్లకు స్వాగతం పలికేందుకు సంతోషంగా ఉంది. కొత్త ఫ్రాంఛైజీలు సొంతం చేసుకున్న సంస్థలకు అభినందనలు. ఐపీఎల్‌ ఇప్పుడిక రెండు కొత్త నగరాలకు వెళ్లనుంది. ఈ జట్ల కోసం ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడం గొప్పగా ఉంది. ఇది మన క్రికెట్‌ విలువను చాటుతోంది. ఈ కొత్త జట్ల ద్వారా మరింత మంది దేశవాళీ ఆటగాళ్లు ప్రపంచ స్థాయి ఆటను ఆడే అవకాశం దక్కుతుంది. భారత్‌ బయట నుంచి కూడా జట్ల కోసం బిడ్లు వచ్చాయి" అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ వెల్లడించారు. 

10 జట్లు 74 మ్యాచ్‌లు 

దీంతో ఐపీఎల్​ 15వ సీజన్​లో (IPL 2022) పది టీమ్స్​ పోటీ పడనున్నాయి. దీంతో మ్యాచ్​ల నిర్వహణ సంఖ్య కూడా 74కు (IPL Matches In 2022) చేరనుంది. దీంతో క్రికెట్​ అభిమానుల్లో ఐపీఎల్​పై మరింత ఆసక్తి పెరిగింది. లీగ్​ మ్యాచ్​లు 70, ప్లేఆఫ్స్​ 4 మ్యాచ్​లు జరగనున్నాయి. లీగ్​ దశలో అన్నీ జట్లు 14 మ్యాచ్​లు ఆడాల్సి ఉంటుంది. లీగ్​ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలోని టాప్​-4 స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్​కు చేరుతాయి.

బిడ్డింగ్​లో పాల్గొన్న కంపెనీలు 

ఐపీఎల్​లో (IPL Broadcast Value) రెండు కొత్త టీమ్స్​ను (New IPL Teams) సొంతం చేసుకునేందుకు అనేక కార్పొరేట్​ కంపెనీలు వేలంలో పోటీ పడ్డాయి. అహ్మదాబాద్​ ఫ్రాంఛైజీని చేజిక్కించుకునేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నాలు చేసింది. కానీ, ఫలితం లేకపోయింది. మరోవైపు అమెరికాకు చెందిన మాంచెస్టర్​ యునైటెడ్​ యజమాని అయిన గ్లేజర్​ ఫ్యామిలీ కూడా ఈ వేలంలో ప్రధానంగా పోటీపడింది. 

ఇంగ్లీష్​ ప్రీమియర్​ లీగ్​లో ఓ టీమ్​ను కొనుగోలు చేసిన రెడ్​ బర్డ్​ క్యాపిటల్స్​ అనే అమెరికా ఆధారిత సంస్థ కూడా బిడ్డింగ్​లో పాల్గొంది. రాజస్థాన్​ రాయల్స్​ జట్టులో ప్రస్తుతం ఈ సంస్థకు 15 శాతం వాటా ఉంది. దీంతో పాటు అదానీ గ్రూప్​, కొటాక్​, అరబిందో ఫార్మా, టొరెంట్​ గ్రూప్​​ కూడా ఐపీఎల్​లో కొత్త టీమ్స్​ను (IPL New Teams 2022) కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయి.    

Also Read: IPL New Franchise Auction: ఐపీఎల్​లో కొత్త టీమ్స్​ బిడ్డింగ్​ కోసం రంగం సిద్ధం..  

Also Read: IPL Broadcasting Rights Price: రూ.37 వేల కోట్లకు ఐపీఎల్​ బ్రాడ్​కాస్టింగ్​ రైట్స్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News