CSK vs DC: ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ విశ్వరూపం ప్రదర్శించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లో రాణించి అద్భుత విజయం సొంతం చేసుకుంది. ఢిల్లీ కేపిటల్స్ జట్టుపై 91 పరుగుల తేడాతో విజయం సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో 55వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ మధ్య ఆసక్తిగా సాగింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. చెన్నైసూపర్ కింగ్స్ ఆరంభం నుంచి ఓ ఛాంపియన్‌లా ఆడింది. రుతురాజ్ గైక్వాడ్,  కాన్వేలు చెలరేగి ఆడారు. రుతురాజ్ 41 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇద్దరూ కలిసి 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తరువాత కాన్వే ఇంకా చెలరేగిపోయాడు. కేవలం 49 బంతుల్లో 87 పరుగులు చేసి అవుటయ్యాడు. కెప్టెన్ ధోని 8 బంతుల్లో 21 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచాడు. తొలుత వికెట్లు పడగట్టలేక విఫలమైన ఢిల్లీ బౌలర్లు చివర్లో మాత్రం వికెట్లు పడగొట్టారు. 


అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ కేపిటల్స్ జట్టు 2 ఓవర్లలోనే తొలి వికెట్ కోల్పోయింది. అయినా సరే ఢిల్లీ కేపిటల్స్ జట్టు ఆటగాళ్లు ధాటిగానే ఆడటం ప్రారంభించారు. ధాటిగా ఆడుతూనే వికెట్లు కోల్పోయారు. ఆ తరువాత వార్నర్ వికెట్ కోల్పోయింది ఢిల్లీ కేపిటల్స్ జట్టు. 7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసిందంటే..ఎంత ధాటిగా ఆడారో అర్ధం చేసుకోవచ్చు. ఆ తరువాత 25 పరుగుల వద్ద మిచెల్ మార్ష్‌ను మొయిన్ అలీ అవుట్ చేశాడు. కాస్సేపటికి కెప్టెన్ రిషభ్ పంత్ కూడా ధాటిగా ఆడుతూనే..మొయిన్ అలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 10 ఓవర్లలో ఢిల్లీ కేపిటల్స్ జట్టు 5 వికెట్లు కోల్పోయి..82 పరుగులు చేసింది. ఆ తరువాత ఓవర్లో ఢిల్లీ కేపిటల్స్ జట్టు ఆరవ వికెట్ అక్సర్ పటేల్‌ను కోల్పోయింది. అదే ఓవర్లో పావెల్ వికెట్‌ను కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. 16వ ఓవర్ ప్రారంభంలో 8వ వికెట్ కోల్పోయింది ఢిల్లీ కేపిటల్స్ జట్టు. 18వ ఓవర్లో 9వ వికెట్ శార్దూల్ పటేల్ రూపంలో కోల్పోయింది. అదే ఓవర్లో మరో రెండు బంతులకు చివరి వికెట్ కూడా కోల్పోయింది.  117 పరుగులకు మరో రెండు ఓవర్లు మిగిలుండగానే ఆలవుట్ అయింది. 91 పరుగుల తేడాతో ఢిల్లీ కేపిటల్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం అందుకుంది.


చెన్నై సూపర్ కింగ్స్ తరపున మొయిన్ అలీ అద్భుతంగా బౌల్ చేసి ఢిల్లీ కేపిటల్స్ నడ్డి విరిచాడు. 4 ఓవర్లలో కేవలం 11 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 


Also read: Sunrisers Hyderabad: వరుస ఓటములు, దూరమౌతున్న ప్లే ఆఫ్ అవకాశాలు, కేన్ మామ ఏమంటున్నాడు మరి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook