Sunrisers Hyderabad: వరుస ఓటములు, దూరమౌతున్న ప్లే ఆఫ్ అవకాశాలు, కేన్ మామ ఏమంటున్నాడు మరి

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాల పాలవుతోంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌తో వరుసగా నాలుగవ ఓటమి నమోదు చేసింది. వరుస ఓటములు..ప్లే ఆఫ్ అవకాశాలపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఏమంటున్నాడంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 8, 2022, 10:38 PM IST
  • వరుస ఓటములతో ప్లే ఆఫ్ అవకాశాలు దూరం చేసుకుంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
  • వరుస ఓటములపై స్పందించిన ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్
  • సమిష్టి వైఫల్యం, కీలక భాగస్వామ్యాల్లో విఫలమే ఓటమికి కారణమని అంగీకరించిన కేన్ మామ
Sunrisers Hyderabad: వరుస ఓటములు, దూరమౌతున్న ప్లే ఆఫ్ అవకాశాలు, కేన్ మామ ఏమంటున్నాడు మరి

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాల పాలవుతోంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌తో వరుసగా నాలుగవ ఓటమి నమోదు చేసింది. వరుస ఓటములు..ప్లే ఆఫ్ అవకాశాలపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఏమంటున్నాడంటే..

ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రోజురోజుకూ ప్లే ఆఫ్ అవకాశాల్ని దూరం చేసుకుంటోంది. టోర్నీ ఆరంభంలో వరుసగా రెండు పరాజయాలు ఎదురైనా అంతలోనే కోలుకుని..వరుసగా ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించి ఓ దశలో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. ఆ తరువాత తిరిగి వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడి పాయింట్ల పట్టికలో కిందకు దిగజారిపోతోంది. వరుస పరాజయాలతో ప్లే ఆఫ్ అవకాశాల్ని దూరం చేసుకుంటోంది. ఇప్పుడు తాజాగా ఆర్బీసీ చేతిలో 67 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 

వరుస ఓటములు, ఇక మిగిలున్న ప్లే ఆఫ్ అవకాశాలపై ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు. అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమయ్యాయమని అంగీకరించాడు. ఛేజింగ్ సందర్భాల్లో మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పడంలో విఫలమయ్యామన్నాడు. సమిష్టి వైఫలమ్యే ఓటమికి కారణమన్నాడు. జట్టులోని లోపాల్ని సరిదిద్దుకుని..రానున్న మూడు మ్యాచ్‌లలో రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాతంగా ఆటను మెరుగుపర్చుకుంటే తప్పకుండా రాణిస్తామన్నాడు. ముందు ముదు కఠినమైన సవాళ్లున్నాయని..అయితే వాటిని అధిగమిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలుంటాయన్నాడు.

మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పడంలో విఫలం కావడం వల్లనే గెలిచే అవకాశాలున్న మ్యాచ్‌లలో ఓడిపోయామన్నాడు. ఆర్సీబీతో ఓటమితో చాలా విషయాలు తెలుసుకున్నామని..ఈసారి అన్ని సరిదిద్దుకుంటామన్నాడు. అందుకే అతిగా ఆలోచించకుండా..ప్రశాంతంగా ఉంటూనే ఆటతీరు మెరుగుపర్చుకుంటామన్నాడు. ఇలా చేయడం ద్వారా తప్పకుండా తిరిగి విజయాలు అందుకుంటామన్నాడు.

Also read: SRH vs RCB: ఎస్ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ ప్రతీకారం, 67 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News