Hetmyer vs Gavaskar: టీమ్ ఇండియా వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మరోసారి నోరుజారి ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు హెట్‌మెయిర్‌పై చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ ఇండియా కీలక ఆటగాడిగా సుదీర్ఘకాలం సేవలందించినా..ప్రపంచ క్రికెట్‌లో సుస్థిర స్థానం సంపాదించుకున్నా సరే..మేనస్ కొరవడింది సునీల్ గవాస్కర్‌కు. హాయిగా విశ్రాంతిగా ఉండాల్సిన సమయంలో అనవసరంగా నోరుజారి విమర్శల పాలవుతున్నాడు. సాటి ఆటగాడిపై చులకనగా మాట్లాడి అప్రతిష్ట కొనితెచ్చుకుంటున్నాడు. అసలేం జరిగింది..


రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు హెట్‌మెయిర్ ఇటీవలే గర్భిణీగా ఉన్న తన భార్య వద్దకు వెళ్లొచ్చాడు. పండంటి బిడ్డకు జన్మ ఇచ్చిన తరువాత తిరిగి ఐపీఎల్ 2022లో చేరాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ ప్రారంభంలో త్వరగానే వికెట్లు కోల్పోయింది. హెట్‌మెయిర్ క్రీజులో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించాలంటే 52 బంతుల్లో 75 పరుగులు చేయాల్సిన పరిస్థితి. నాలుగు వికెట్లు కోల్పోయింది. అదే సమయంలో గవాస్కర్ అసందర్భ, అనాలోచిత వ్యాఖ్యలు చేశాడు. కామెంటేటర్‌గా ఉన్న గవాస్కర్..వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నాయి. హెట్‌మెయిర్ భార్యకు డెలివరీ అయింది..మరి హెట్‌మెయిర్ రాజస్థాన్ రాయల్స్‌కు డెలివరీ ఇస్తాడా అంటూ సునీల్ గవాస్కర్ కామెంట్ చేయడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.


సునీల్ గవాస్కర్ వ్యవహారశైలిని తూర్పారబడుతున్నారు. సునీల్ గవాస్కర్ షేమ్‌లెస్ వ్యక్తి అని..ఈ ఏడాది అత్యంత చెత్తగా ఉన్న అంపైరింగ్ కంటే సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలే చెత్తగా ఉన్నాయని ఇలా మండిపడుతున్నారు. సునీల్ గవాస్కర్ కామెంటరీ అంత దరిద్రం మరొకటి లేదని విమర్శిస్తున్నారు. అంతేకాదు బ్యాన్ సునీల్ గవాస్కర్ అంటూ హ్యాష్‌ట్యాగ్ కూడా రన్ అవుతోంది. మరొకరి భార్య గురించి అంత ఫన్నీగా కామెంటరీ చేయాల్సిన అవసరమేమొచ్చిందంటూ నిలదీస్తున్నారు. 


Also read: RR vs CSK: చెన్నైపై సూపర్ విక్టరీ.. పట్టికలో రెండో స్థానానికి చేరిన రాజస్థాన్! క్వాలిఫైర్ 1లో గుజరాత్‌తో ఢీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook