CSK vs SRH: టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. జాన్సెన్ ఆయేగా! ఒక మార్పుతో బరిలోకి చెన్నై.. బోణీ ఎవరిది?
IPL 2022, CSK vs SRH Playing 11. ఐపీఎల్ 2022లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య డీవై పాటిల్ స్టేడియం వేదికగా మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
IPL 2022, CSK vs SRH Playing 11 Out: ఐపీఎల్ 2022లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య డీవై పాటిల్ స్టేడియం వేదికగా మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసినట్టు కేన్ మామ చెప్పాడు. శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు చెన్నై ఒక మార్పుతో ఆడనునట్లు సారథి రవీంద్ర జడేజా చెప్పాడు. డ్వేన్ ప్రిటోరియస్ స్థానంలో మహేష్ తీక్షణ ఆడనున్నాడు.
ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. అటు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఆడిన రెండు మ్యాచుల్లోనూ పరాజయం పొందింది. దీంతో ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి గెలుపు ఐపీఎల్ 2022లో బోణీ కొట్టాలని రెండు జట్లు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
తుది జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మార్కో జాన్సెన్.
చెన్నై సూపర్ కింగ్స్: రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ, మహేష్ తీక్షణ, డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, ముకేశ్ చౌదరి.
Also Read: Girls Cutting Hair: వారి నుంచి తప్పించుకునేందుకు.. జుట్టు కత్తిరించుకుంటున్న ఆడపిల్లలు!
Also Read: Aadhar Download: మొబైల్ నంబరు లేకుండానే ఇకపై ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook