IPL 2022: గేల్, డివిలియర్స్ కాదు.. రోహిత్ శర్మనే నాకు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు: ఢిల్లీ ఎంపీ
Gautam Gambhir about Rohit Sharma. టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మపై భారత మాజీ ఓపెనర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించారు.
Gautam Gambhir hails Rohit Sharma's Captaincy in IPL: టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మపై భారత మాజీ ఓపెనర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఐపీఎల్ చరిత్రలో హిట్‌మ్యాన్ అత్యంత విజయవంతమైన సారథి అని పేర్కొన్నారు. ఐపీఎల్‌లో తాను కెప్టెన్‌గా ఉండగా రోహిత్ ఒక్కడే నిద్రలేని రాత్రులు మిగిల్చాడన్నారు. ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టును ఢిల్లీ ఎంపీ అయిన గంభీర్ రెండు టైటిల్స్ అందించిన విషయం తెలిసిందే.
స్టార్ స్పోర్ట్స్‌లో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'ఐపీఎల్‌లో నేను కెప్టెన్‌గా ఉన్న సమయంలో రోహిత్ శర్మ ఒక్కడే నాకు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ లాంటి స్టార్ బ్యాటర్లతో నాకు ఎలాంటి ఇబ్బంది ఎదురవలేదు. ఒక్క రోహిత్ మాత్రమే నాకు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా రోహిత్ కంటే విజయవంతమైన క్రికెటర్ లేడు. రోహిత్ అద్భుతమైన సారథి' అని చెప్పారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు గౌతీ మెంటార్‌గా నియమితుడయిన సంగతి తెలిసిందే.
ముంబై ఇండియన్స్ విజయాక కోసం రోహిత్ శర్మ ఎంతో కష్టపడ్డాడని, అతడి సహకారం మరువలేనిదని భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. లీగ్‌లో కెప్టెన్‌గా అజేయమైన ప్రదర్శనలను ఇచ్చిన హిట్‌మ్యాన్.. చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడన్నారు. రోహిత్ శర్మ పేరు ముంబై ఇండియన్స్, ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఇర్ఫాన్ చెప్పుకొచ్చారు. ఇర్ఫాన్ 103 ఐపీఎల్ మ్యాచులు ఆడిన విషయం తెలిసిందే.
రోహిత్ శర్మ 2013లో తొలిసారి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఎంపికవ్వగా.. అదే ఏడాది జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. రికీ పాంటింగ్ నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న హిట్‌మ్యాన్.. వరుస విజయాలు అందించి విజయవంతమైన జట్టుగా తీర్చిదిద్దాడు. 2013, 2015, 2017, 2019 మరియు 2020లో ఐపీఎల్ ట్రోఫీలను ముంబై గెలుచుకుంది. దీంతో రోహిత్ ఐపీఎల్‌లో అత్యుత్తమ సారథిగా గుర్తింపు పొందాడు.
Also Read: UP Election Result: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కమలం దూకుడు.. సంబురాలు ప్రారంభించిన బీజేపీ కార్యకర్తలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook