UP Election Result: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కమలం దూకుడు.. సంబురాలు ప్రారంభించిన బీజేపీ కార్యకర్తలు!

UP Election Result: ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టేందుకు అధికార బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది. గతంలో కంటే మెరుగైన సీట్లు సాధించడం వల్ల కాషాయ వర్గాల్లో సంబరాలు మొదలయ్యాయి. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి మరీ ఎక్కువ స్థానాల్లో విజయం వైపు దూసుకుపోతోందీ కమలం పార్టీ. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ కూడా గోరఖ్‌పూర్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తానికి యోగీ ఆదిత్యనాథ్‌ మరోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోబోతున్నారు. యూపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2022, 01:25 PM IST
UP Election Result: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కమలం దూకుడు.. సంబురాలు ప్రారంభించిన బీజేపీ కార్యకర్తలు!

UP Election Result: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో వందకు వంద శాతం ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజం కాబోతున్నాయి. యూపీలో మరోసారి అధికార బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తుంది. ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే మ్యాజిక్ ఫిగర్ 202ను అధిగమించింది కాషాయ జెండా. స్థానిక పార్టీలతో కలిసి కూటమిగా ఎస్పీ అధినేత మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ జట్టు కట్టిన..ఆయనకు నిరాశే మిగిలింది. యోగి హవా ముందు కాంగ్రెస్, బీఎస్పీ, AIMIM పార్టీలకు ఘోర పరాభవం తప్పలేదు.

యూపీలో యోగి హవా

ఉత్తరప్రదేశ్‌లో కమలానికే రెండోసారి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు మొగ్గు చూపారు. ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మెజార్టీ సీట్లను కమలం పార్టీ సునాయాసంగా గెలుచుకోనుంది. గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు కొద్దిగా తగ్గినా.. యోగి ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు లాంఛనంగా కనిపిస్తోంది.

సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీకి సోషల్ మీడియా క్యాంపెయినింగ్ బాగా కలిసొచ్చింది. ముజఫర్‌నగర్ లోకల్ ఎన్నికల్లో మంచి రిజల్ట్ రావడం వల్ల అదే వ్యూహాన్ని అసెంబ్లీ ఎన్నికలకు కమలం పార్టీ అనుసరించింది. ఇప్పుడా సోషల్ మీడియా ప్రచారం సూపర్ హిట్ అయ్యింది. ఓబీసీలు యోగి నాయకత్వానికే మొగ్గు చూపారు. 

మరోవైపు అఖిలేష్ ఆధ్వర్యంలోని సమాజ్ వాదీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. కొన్ని ఏళ్ల తర్వాత సమాజ్ వాదీ పార్టీకి వంద సీట్లు దాటడం ఆ పార్టీ వర్గాల్లో కొంతమేర జోష్ తెచ్చినట్లు అయ్యింది. గత ఎన్నికల్లో ప్రతిపక్షం ఎప్పుడూ 50 స్థానాల కంటే ఎక్కువ విజయం సాధించిన సందర్భాలు లేవు. ఈ ఎన్నికల్లో యూపీలో ఎంఐఎం పార్టీ ఓటింగ్ శాతం పెంచుకుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

మాయావతి ప్రభావం లేని ఎన్నికలు

గతంలో 4 సార్లు యూపీని పాలించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేక పోయారు. హస్తం కీలక నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించనప్పటికి ఎన్నికల ఫలితాల్లో అత్తెసరు ప్రభావం కూడా చూపలేకపోయింది.
సీఎం యోగి రికార్డు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ అసెంబ్లీ స్థానం నుంచి భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. యూపీలో 70 సంవత్సరాల తర్వాత రికార్డు బద్ధలు అయ్యేలా ఎన్నికల ఫలితాలు కనిపిస్తున్నాయి. స్వాతంత్రం వచ్చాక ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి ఒక సీఎం పూర్తి పదవీ కాలం ముగించుకున్నాక రెండో సారి ఎన్నిక కావడం ఇదే మొదటిసారి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.   

Also Read: UP election result 2022: యూపీలో బీజేపీకే మళ్లీ పట్టం.. చరిత్ర సృష్టించబోతున్న యోగీ!

Also Read: Punjab Election Results 2022: పంజాబ్‌లో ఆప్ విజయానికి కారణాలేంటి, కాంగ్రెస్ పతనానికి మూలమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News