Punjab Kings chased 200 plus runs total for 4th time in history: ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ ఐదు వికెట్లు కోల్పోయి 19 ఓవర్లో 208 పరుగులు చేసి విజయం సాధించింది. ఇన్నింగ్స్ చివరలో షారుఖ్‌ ఖాన్ (24 నాటౌట్; 20 బంతుల్లో 1x 4ర్‌, 2x 6), ఒడియన్ స్మిత్ (25 నాటౌట్; 8 బంతుల్లో 1x 4ర్‌, 3x 6) ఆకాశమే హద్దుగా చెలరేగి తమ జట్టుకి ఊహించని విజయాన్ని అందించారు. దాంతో పంజాబ్ టోర్నీలో బోణీ కొట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెంగళూరు, పంజాబ్‌ మ్యాచులో పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో.. ఐపీఎల్ టోర్నీలో అత్యధికంగా నాలుగు సార్లు 200లకు పైగా స్కోర్లను ఛేదించిన జట్టుగా నిలిచింది. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఇన్నిసార్లు 200 పై చిలుకు స్కోర్లను సాదించలేదు. దాంతో ఏ జట్టుకు సాధ్యంకాని గొప్ప రికార్డును పంజాబ్ తన ఖాతాలో వేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు 200కు పైగా లక్ష్యాలను ఛేదించి రెండో స్థానంలో ఉంది.


మరోవైపు ఐపీఎల్ టోర్నీలో బెంగళూరు జట్టు నాలుగు సార్లు 200ల పై చిలుకు లక్ష్యాలను కాపాడుకోలేకపోయి చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 21 వైడ్లు వేయడం ద్వారా.. టోర్నీ మొత్తంలో ఒక్క మ్యాచ్‌లో అత్యధిక వైడ్లు వేసిన జట్టుగా మరో రికార్డు నెలకొల్పింది. అంతకుముందు పంజాబ్‌ 2011లో కొచీ టస్కర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యధికంగా 19 వైడ్లు వేసి ఈ జాబితాలో తొలి స్థానంలో ఉండగా.. ఇప్పుడు బెంగళూరు అధిగమించింది. 2008లో రాజస్థాన్‌పై, 2018లో ముంబైపైనా బెంగళూరు జట్టు 18 వైడ్లు వేసింది. రాజస్థాన్‌ 2015లో కోల్‌కతాపై 18 వైడ్లు వేసి ఈ జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.


Also Read: Punjab Kings: పంజాబ్ గెలవడానికి ఆ సినిమానే కారణం.. మ్యాచుకు ముందు..! అసలు విషయం చెప్పేసిన స్మిత్‌!


Also Read: Attack on CM: సీఎం భద్రతలో లోపం.. దాడికి యత్నించిన యువకుడు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook