CSK Retained Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022కు సర్వం సిద్ధమవుతోంది. 2022 జనవరిలో మెగా ఆక్షన్‌కు సిద్ధమవుతుండటంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిటైన్డ్ ప్లేయర్స్ జాబితా విడుదల చేసింది. ముందుగా చెన్నై సూపర్‌కింగ్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లను పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత విజయవంతమైన జట్లుగా చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లను చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్ 5 సార్లు టైటిల్ గెల్చుకోగా, చెన్నై సూపర్‌కింగ్స్ 4 సార్లు టైటిల్ సాధించింది. జనవరి 2022లో జరిగే మెగా ఆక్షన్(IPL 2022 Mega Auction) కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లు ఏయే ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటుందో, ఎవరిని వదులుకుంటుందో వెల్లడించాల్సి ఉంది. ఈ నేపధ్యంలో నిన్న అంటే నవంబర్ 30వ తేదీన జరిగిన కార్యక్రమంలో సీఎస్కే జట్టు రిటైన్ ఆటగాళ్ల జాబితా విడుదల చేసింది. 


మొత్తం నలుగురు ఆటగాళ్లను సీఎస్కే (CSK Retained Players List)రిటైన్ చేసుకుంది. రిటైన్ ప్లేయర్స్ జాబితాలో రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. సురేష్ రైనా, హర్భజన్ సింగ్, డుప్లెసిస్, ఎంగిడి వంటి సామర్ధ్యమున్న ఆటగాళ్లను సీఎస్కే వదులుకుంది. సీఎస్కే జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకు ఆ టీమ్ యాజమాన్యం 12 కోట్ల రూపాయలు చెల్లిస్తుండగా, రవీంద్ర జడేజాకు ఏకంగా 16 కోట్లు చెల్లిస్తోంది. ఇక మొయిన్ అలీకు 8 కోట్లు చెల్లిస్తుండగా, రుతురాజ్ గైక్వాడ్‌కు 6 కోట్లు ఇస్తోంది. అయితే సురేష్ రైనా(Suresh Raina), హర్భజన్( Harbhajan), డుప్లెసిస్( Du Plessis) వంటి కీలకమైన స్టార్ ఆటగాళ్లను సీఎస్కే యాజమాన్యం వదులుకోవడం ఆశ్యర్చం కల్గిస్తోంది. 


బీసీసీఐ నిబంధనల ప్రకారం


బీసీసీఐ (BCCI)రిటెన్షన్ కోసం కొన్ని నిబంధనల్ని విధించింది. దీని ప్రకారం వివిధ ఫ్రాంచైజీలు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇద్దరు భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవల్సి ఉంటుంది. లేదా ముగ్గురు భారత ఆటగాళ్లు, ఒక విదేశీ ఆటగాడిని రిటైన్ చేసుకునే వీలుంది. అదే అన్ క్యాప్డ్ అయితే ఇద్దరు మించకూడదు. నలుగురిని రిటైన్ చేసుకుంటే తొలి ప్లేయర్ కు 16 కోట్లు, రెండవ ఆటగాడికి 12 కోట్లు, మూడవ ఆటగాడికి 8 కోట్లు, నాలుగవ ఆటగాడికి 6 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం 90 కోట్ల నుంచి 42 కోట్లు కోల్పోతే..మిగిలిన 48 కోట్లతోనే ఇతర ఆటగాళ్లను వేలంలో తీసుకోవల్సి ఉంటుంది. 


Also read: Cricketers Houses: టీమ్ ఇండియా క్రికెటర్ల అందమైన ఇళ్లు ఎలా ఉన్నాయో చూద్దామా


https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook