IPL 2023 Auction: ఈ ముగ్గురు భారత ఆటగాళ్లపై కన్నేసిన ప్రీతీ జింటా, కావ్యా మారన్.. ఇక పండగే పండగ!
Preity Zinta, Kaviya Maran eye on Mayank Agarwal, N Jagadeesan and Jaydev Unadkat at IPL 2023 Auction. 2022 డిసెంబర్ 23న కొచ్చిలో వేలం జరగనుంది. ఈ ముగ్గురు భారత ఆటగాళ్లపై ఐపీఎల్ ప్రాంచైజీలు కన్నేశాయి.
Preity Zinta, Kaviya Maran eye on Mayank Agarwal, N Jagadeesan and Jaydev Unadkat at IPL 2023 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 మినీ వేలం కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సర్వం సిద్ధం చేసింది. 2022 డిసెంబర్ 23న కొచ్చిలో వేలం జరగనుంది. 10 ఫ్రాంచైజీలు వేలానికి 405 మంది క్రికెటర్లు షార్ట్‌లిస్ట్ చేశాయి. ఇందులో 273 మంది భారతీయ క్రికెటర్లు ఉండగా.. 132 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరితో పాటు నలుగురు అసోసియేట్ దేశాలకు చెందినవారు కూడా వేలంలో పాల్గొననున్నారు. వేలంలో స్టార్ ప్లేయర్స్ ఉన్న నేపథ్యంలో ఫ్రాంచైజీల మధ్య పోటీ తప్పకపోవచ్చు. స్వదేశీ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లకు కూడా భారీ డిమాండ్ ఉండనుంది. ముఖ్యంగా ఈ ముగ్గురు భారత ఆటగాళ్లపై ఐపీఎల్ ప్రాంచైజీలు కన్నేశాయి.
మయాంక్ అగర్వాల్:
కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకి మారిన తర్వాత మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. 13 మ్యాచ్‌లలో మయాంక్ 16.33 సగటు 122.50 స్ట్రైక్ రేట్‌తో 196 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు ప్లేఆఫ్‌కు అర్హత సాధించడంలో
పంజాబ్ విఫలమైంది. దాంతో ఐపీఎల్ 2023 వేలంలో పంజాబ్ అతడిని వదిలేసింది. 2022లో విఫలమయినా.. 2020లో 156.45 స్ట్రైక్ రేట్‌తో 424 పరుగులు, 2021లో 140.44 స్ట్రైక్ రేట్‌తో 441 పరుగులు చేశాడు. మంచి ఓపెనర్‌గా పేరున్న మయాంక్.. తనదైన రోజున ఎలాంటి బౌలింగ్‌లో అయినా ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడు. అందుకే అతని కోసం ఫ్రాంచైజీలు గట్టిగా పోటీ పడే అవకాశం ఉంది. పంజాబ్ సహా యజమాని ప్రీతీ జింటా.. మళ్లీ మయాంక్ ను జట్టులోకి తీసుకోవాలని అనుకుంటున్నారట. వేలంలో మయాంక్ కనీస ధర ఒక కోటి.
ఎన్ జగదీశన్:
తమిళనాడు బ్యాటర్ ఎన్ జగదీశన్.. ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. రెండు గేమ్‌లలో 108.11 స్ట్రైక్ రేట్‌తో 40 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2023 వేలానికి ముందు చెన్నై అతడిని వదిలేసింది. విజయ్ హజారే ట్రోఫీ 2022-23లో జగదీసన్ 6 మ్యాచ్‌లలో 138.33 సగటుతో 830 పరుగులు బాదాడు. దాంతో జగదీసన్‌ను తీసుకునేందుకు అన్ని ప్రాంఛైజీలు చూస్తున్నాయి. హైదరాబాద్ ప్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్.. జట్టులోకి తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. జగదీశన్ భారీ ధర పలికే అవకాశం ఉంది. వేలంలో జగదీశన్ కనీస ధర ₹20 లక్షలు.
జయదేవ్ ఉనద్కత్:
సౌరాష్ట్ర లెఫ్టార్మ్ సీమర్ జయదేవ్ ఉనద్కత్ 2010 తర్వాత తొలిసారిగా భారత టెస్టు జట్టులోకి వచ్చాడు. 31 ఏళ్ల ఉనద్కత్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాడు. విజయ్ హజారే ట్రోఫీ 2022-23లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 10 మ్యాచ్‌లలో 16.10 సగటుతో 19 వికెట్లు పడగొట్టాడు. 2022లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడిన ఉనద్కత్.. 2018-2020 వరకు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. మంచి ఫామ్ కనబర్చుతున్న ఇతడిని తీసుకోవడానికి ప్రాంఛైజీలు ఎగబడడం పక్కా. ఉనద్కత్ కనీస ధర ₹50 లక్షలు. నిర్ణయించారు.
Also Read: ఇలాంటి ఆఫర్ మళ్లీమళ్లీ రాదు.. Mi 5A 32 inch TVపై 48 శాతం తగ్గింపు! వెంటనే కొనేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.