Mi TV Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో 48 శాతం తగ్గింపు ఆఫర్.. రూ.12999లకే Mi 5A 32 inch LED Smart TV!

Mi 5A 32 inch HD Ready LED Smart Android TV buy only Rs 1999 in Flipkart Big Saving Days 2022. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా ఎంఐ 5ఏ 32 ఇంచ్ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీపై 48 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 20, 2022, 02:13 PM IST
  • ఇలాంటి ఆఫర్ మళ్లీమళ్లీ రాదు
  • Mi 5A 32 inch TVపై 48 శాతం తగ్గింపు
  • టీవీని వెంటనే కొనేసుకోండి
Mi TV Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో 48 శాతం తగ్గింపు ఆఫర్.. రూ.12999లకే Mi 5A 32 inch LED Smart TV!

48 Percent discount on Mi 5A 32 inch HD Ready LED Smart TV in Flipkart Big Saving Days 2022: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ 'షియోమీ' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగానే కాదు ఇండియాలో కూడా షియోమీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సామాన్యులకు అందుబాటు ధరలో మొబైల్స్ తీసుకొస్తూ.. స్మార్ట్‌ఫోన్ రంగంలో షియోమీ అద్భుతాలు సృష్టిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్తకొత్త స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తుంది. అలానే టీవీలను కూడా భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం Mi 5A సిరీస్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సిరీస్‌ 32 ఇంచ్ టీవీపై  48 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. 

ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 'బిగ్ సేవింగ్ డేస్ సేల్' కొనసాగుతోంది. క్రిస్టమస్ 2022 సందర్భంగా ఈ సెల్ డిసెంబర్ 16 నుంచి 21 వరకు కొనసాగనుంది. ఈ సెల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లతో సహా పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపు ఉంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా ఎంఐ 5ఏ 32 ఇంచ్ ఎల్‌ఈడీ (Mi 5A 32 inch LED Smart TV) స్మార్ట్ టీవీపై 48 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. రూ. 24,999 ఈ స్మార్ట్ టీవీ ఆఫర్‌లో భాగంగా రూ. 12,999లకే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీపై రూ. 12,000 తగ్గింపు ఉంది. 

ఎంఐ 5ఏ 32 ఇంచ్ ఎల్‌ఈడీ (Mi 5A 32 inch HD Ready LED Smart Android TV with Dolby Audio, 2022 Model)పై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు మరియు క్రెడిట్ EMI Trxnsపై 10% తగ్గింపు ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ EMI Trxnsపై బ్యాంక్ ఆఫర్ 10% తగ్గింపు ఉంది. ఎంఐ 5ఏ 32 ఇంచ్ ఎల్‌ఈడీ టీవీపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ రూ. 11,000 ఉంది. పూర్తి ఆఫర్ వర్తిస్తే.. ఈ టీవీని మీరు రూ.1,999లకే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఈ ఆఫర్ మరొక్క రోజు మాత్రమే ఉంది. ఇలాంటి ఆఫర్ మళ్లీమళ్లీ రాదు. వెంటనే బుక్ చేసుకోండి. 

Also Read: Infinix Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో మెగా బంపర్ ఆఫర్.. రూ 16690కే ఇన్‌ఫినిక్స్‌ స్లిమ్ సిరీస్ ల్యాప్‌టాప్‌!  

Also Read: Beetroot Juice Benefits: కష్టమైనా బీట్‌రూట్ జ్యూస్ తాగండి.. రోజుల్లోనే ఈ 9 ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టండి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News