Chennai Super Kings Retained and Released Players List for IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 రిటెన్షన్ ప్రక్రియకు మంగళవారం (నవంబర్ 15) సాయంత్రం 5 గంటలకు గడువు ముగియడంతో.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తమ జాబితాను ప్రకటించింది. స్టార్ ప్లేయర్ డ్వేన్ బ్రావోకి సీఎస్‌కే హ్యాండిచ్చింది. ఎవరూ ఊహించని విధంగా బ్రావోను రిలీజ్ ప్లేయర్స్ జాబితాలో చేర్చింది. బ్రావోతో పాటుగా రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్‌లపై కూడా సీఎస్‌కే వేటు వేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలవడంలో డ్వేన్ బ్రావో కీలక పాత్ర పోషించాడు. అయితే గత రెండు సీజన్లుగా బ్రావో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తేలిపోయాడు. దాంతో సీఎస్‌కే అతడిని వదిలేసింది. మరి విండీస్ ప్లేయర్ బ్రావో ఐపీఎల్ 2023 వేలంలో పాల్గొంటాడో లేదో చూడాలి. ఇక రాబిన్ ఉతప్ప రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. క్రిస్ జోర్డాన్‌ ఆశించిన మేర రాణించలేదు. 


నాలుగు సార్లు విజేతగా నిలిపిన కెప్టెన్ ఎంఎస్ ధోనీని చెన్నై సూపర్ కింగ్స్‌ అట్టిపెట్టుకుంది. ధోనీతో పాటుగాస్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా నిలుపుకుంది. మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, డెవాన్ కాన్వే, ముఖేష్ చౌదరి, డ్వేన్ ప్రిటోరియస్ మరియు దీపక్ చహర్‌లను చెన్నై రిటెన్షన్ జాబితాలో చేర్చింది. ప్రస్తుతం చెన్నైలో 7 ఖాళీలు ఉండగా.. ఇద్దరు విదేశీ ఆటగాళ్లకు అవకాశం ఉంది. 


సీఎస్‌కే రిటెన్షన్ లిస్ట్:
ఎంఎస్ ధోనీ
రవీంద్ర జడేజా
అంబటి రాయుడు
సుభ్రాంశు సేనాపతి
మొయిన్ అలీ
రుతురాజ్ గైక్వాడ్
శివమ్ దూబే
డెవాన్ కాన్వే
ముఖేష్ చౌదరి
డ్వేన్ ప్రిటోరియస్ 
దీపక్ చహర్‌
మిచెల్ సాంట్నర్
రాజవర్ధన్ హంగర్గేకర్
మహేశ్ తీక్షణ
తుషార్ దేశ్‌పాండే
సిమర్జీత్ సింగ్
మతీషా పతిరణ
ప్రశాంత్ సోలంకి


సీఎస్‌కే రిలీజ్ లిస్ట్:
డ్వేన్ బ్రావో
రాబిన్ ఉతప్ప
ఆడమ్ మిల్నే
హరి నిశాంత్
క్రిస్ జోర్డాన్
భగత్ వర్మ
కేఎం ఆసిఫ్ నారాయణ్ జగదీశన్


Also Read: Dog Viral Video: తల వంచి మరీ బొజ్జ గణపతిని మొక్కిన శునకం.. వీడియో చూసి వావ్ అనకుండా ఉండలేరు!  


Also Read: Jabardasth Varsha: ట్రాక్టర్ నడిపిన జబర్దస్త్ బ్యూటీ.. వర్ష స్టిల్స్ మాములుగా లేవుగా..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook