IPL 2023 SRH Coach, Sunrisers Hyderabad appointed Brian Lara as a Head Coach: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్.. ఐపీఎల్ 2023 కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలెట్టింది. గతేడాది ఆటగాళ్లను మార్చిన ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్మెంట్.. ఇప్పుడు కోచ్‌ను కూడా మార్చేసింది. ఐపీఎల్ 2022 వరకు ఎస్‌ఆర్‌హెచ్ సలహాదారు, బ్యాటింగ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాను హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని ఎస్‌ఆర్‌హెచ్ తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'క్రికెట్ దిగ్గజం బ్రియాన్‌ లారాను వచ్చే సీజన్‌ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హెడ్ కోచ్‌గా నియమించాం' అని ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ ట్వీట్‌ చేసింది. బ్రియాన్‌ లారా నియామకంతో ప్రధాన కోచ్‌గా ఉన్న టామ్‌ మూడీ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. టామ్‌ మూడీని కాంట్రాక్ట్‌ను పొడిగించకూడదని మేనేజ్మెంట్ నిర్ణయించిందట. అయితే కోచ్ నియామకంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావ్యా మారన్ కీలక పాత్ర ఉందని తెలుస్తోంది.


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు టామ్‌ మూడీ ప్రధాన కోచ్‌గా ఉన్న 2013 నుంచి 2019 వరకు పని చేశారు. ఈ సమయంలో హైదరాబాద్‌ విజయాలతో దూసుకుపోయింది. 2016లో టైటిల్‌ కూడా గెలిచింది. 2020, 2021లోఆయన  డైరెక్టర్‌గా వ్యవహరించాడు. 2022లో హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్‌ స్థానంలో మూడీ తిరిగి ప్రధాన కోచ్‌ బాధ్యతలను చేపట్టాడు. గత సీజన్‌లో మాత్రం ఎస్‌ఆర్‌హెచ్ పేలవ ప్రదర్శన చేసింది. ఏకంగా ఎనిమిదో స్థానంతో టోర్నీని ముగించింది.



ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది. అయినా కూడా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పటినుంచే దిద్దుబాటు చర్యలకు దిగింది. కొన్ని సీజన్లుగా టీమ్ చెత్త ప్రదర్శన సాగిస్తూ వస్తోన్న నేపథ్యంలో కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగానే లెజెండరీ బ్యాటర్ బ్రియాన్ లారా‌ను హెడ్ కోచ్‌గా నియమించింది. ఇప్పటికే రెండు దఫాలుగా టామ్ మూడీ కాంట్రాక్ట్‌ను ఎస్‌ఆర్‌హెచ్ పొడిగించింది. మూడోసారి మాత్రం ఆ నిర్ణయం తీసుకోలేదు.


Also Read: తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచిన రణ్‌బీర్‌.. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండంటూ..!


Also Read: పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్.. హై ఆల్టిట్యూడ్ మాస్క్‌తో విరాట్ కోహ్లీ! అసలు విషయం ఏంటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook