CSK vs RCB Match Live: చెలరేగిన దినేష్ కార్తీక్, అనుజ్ రావత్... చెన్నై ముందు భారీ టార్గెట్..
CSK vs RCB Match Live: చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి ఐపీఎల్ మ్యాచ్ లో దినేష్ కార్తీక్, అనుజ్ రావత్‌లు మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది ఆర్సీబీ.
IPL 2024, CSK vs RCB Live Score: ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. చెన్నై సూపర్ కింగ్స్ ముందు భారీ టార్గెట్ ఉంచింది. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ ఆటగాళ్లు రాణించడంతో ఆర్సీబీ తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
మెుదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా డుపెస్లిస్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. డేంజరస్ గా మారుతున్న ఇతడిని ముస్తాఫిజర్ పెవిలియన్ కు పంపాడు. డుప్లెసిస్ 23 బంతుల్లో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు ఉన్నాయి. అనంతరం క్రీజులకో వచ్చిన పటిదార్, మాక్స్ వెల్ డకౌట్ అయ్యారు. కింగ్ కోహ్లీకి జతకలిసిన కామెరూన్ గ్రీన్ నిలకడగా ఆడారు. వీలుచిక్కినప్పుడు బౌండరీలు కొడుతూ స్కోరు వేగాన్ని పెంచారు. రచిన్ రవీంద్ర అద్భుతమైన క్యాచ్ పట్టడంతో కోహ్లీ వెనుదిరిగాడు. వెంటనే గ్రీన్ కూడా బౌల్డ్ అయ్యాడు.
రావత్, కార్తీక్ మెరుపులు..
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చి రావత్, దినేష్ కార్తీక్ చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించారు. పోటాపోటీగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోరుబోర్డును రాకెట్ స్పీడ్ తో పరిగెత్తించారు. ఈ క్రమంలో రావత్ తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకుని.. చివరి వికెట్ గా వెనుదిరిగాడు. రావత్ 25 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లుతో 48 పరుగులు చేయగా.. 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు సహాయంతో 38 పరుగులే చేసి నాటౌట్ గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తాఫిజుర్ 4 వికెట్లు తీశాడు.
Also Read: RCB vs CSk Match Live: టాస్ గెలిచిన ఆర్సీబీ.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter