MS Dhoni Video viral: మహేంద్ర సింగ్ ధోని తన ఆట, వ్యక్తిత్వంతోనే కాకుండా తన చేష్టలతోనూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటాడు. తాజాగా ఈ మిస్టర్ కూల్ చేసిన ఓ పని నెటిజన్స్ హృదయాలను దోచుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
మరికాసేపట్లో చెన్నై, బెంగళూరు మ్యాచ్ తో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ జరగబోయే చెపాక్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ముమ్మరంగా ఫ్రాక్టీస్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ చెమటోడిస్తూ కనిపించారు. అదే సమయంలో వారికి చెన్నై సహాయక సిబ్బంది డ్రింక్స్ ఏర్పాటు చేశారు. ఆటగాళ్ల అందరూ ప్రాక్టీసులో మునిగిపోవడంతో.. డ్రింక్స్ బాక్స్‌లను తేవడంలో సిబ్బందికి ధోని సహకరించాడు. ఏ మాత్రం ఇగో లేకుండా బాక్స్ లను తీసుకొచ్చాడు. మహి చేసిన ఈ పని అభిమానులను ఎంతోగానే ఆకట్టుకుంది. అంతే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది.
ధోనీకి ఇదే చివరి సీజనా?
అయితే ఐపీఎల్ ప్రారంభానికి ఒక్కరోజు ముందు ధోని తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో సీఎస్కే పగ్గాలు రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించారు. అయితే ఈ యంగ్ ప్లేయర్ కు గతంలో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. అయితే ధోని కెప్టెన్ కాకపోయినా రుతురాజ్ కు మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది. గతంలో కూడా ధోనిని స్థానంలో జడేజాను కెప్టెన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే మహికి ఇదే చివరి సీజన్ కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. 42 ఏళ్ల ధోని ఈ సీజన్ తర్వాత వీడ్కోలు పలికే అవకాశం ఉందని తెలుస్తోంది.
🌟Most Humble and Down to earth Cricketer - MS Dhoni helps out the support staff with Drinks at Chepauk Chennai pic.twitter.com/ljmxuNL7AK
— ICT Fan (@Delphy06) March 22, 2024
తొలి మ్యాచ్ కు సీఎస్‌కే జట్టు(అంచనా): రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, శార్దూల్ ఠాకూర్
Also Read: MS Dhoni: చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకున్న ధోనీ.. కొత్త సారథి ఎవరంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter