IPL 2024 Schedule: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే ఏడాది విదేశాల్లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్‌ను వేదికల గురించి బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలు మే-జూన్‌లో జరిగే అవకాశం ఉండడంతో ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. దీంతో గతంలో మాదిరే విదేశాల్లో ఐపీఎల్‌ను నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం బీసీసీఐ దృష్టి అంతా వన్డే వరల్డ్ కప్ 2023పైనే ఉంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఈ మెగా టోర్నీకి ఏర్పాట్లు చేసే పనిలో బిజీగా ఉంది. ప్రపంచ కప్ ముగిసిన తరువాత ఐపీఎల్ గురించి ఆలోచించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో నిర్వహణ సమస్యల గురించి తమకు తెలుసు అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇంగ్లాండ్ సిరీస్, ఆపై సాధారణ ఎన్నికలతో పాటు జూన్‌లో టీ20 ప్రపంచకప్‌లు ఉన్నాయని అన్నారు. ఏదైనా ప్లాన్ చేయడానికి ఇది చాలా తొందరగా అవుతుందని.. అక్టోబర్‌లో జరిగే ప్రపంచకప్‌ను విజయవంతంగా నిర్వహించడంపై తామంతా దృష్టి సారించామని వెల్లడించారు. డిసెంబర్-జనవరిలో మాత్రమే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.


ఐపీఎల్‌ను గతంలోనూ విదేశాల్లో నిర్వహించారు. 2009 ఎన్నికల సందర్భంగా దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. 2014 ఎన్నికల సమయంలో కొన్ని మ్యాచ్‌లు యూఏఈలో.. మరికొన్ని మ్యాచ్‌లను భారత్‌లో ఆడించారు. కరోనా సమయంలోనూ యూఏఈలోనే ఐపీఎల్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.  2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల తేదీలను దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్‌ను రూపొందించారు. మొత్తం టోర్నమెంట్ భారత్‌లోనే జరిగింది. 


ఐపీఎల్‌ను మార్చి-మే నిర్వహించేందుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. ఇది రీషెడ్యూలింగ్‌కు అవకాశం లేదు. మార్చి 11న భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ముగియనుంది. అంటే ఆ తరువాతే ఐపీఎల్ ప్రారంభం కావాలి. టీ20 ప్రపంచ కప్ 2024 జూన్ 4న ప్రారంభం కానుంది. మే-జూన్ నెలల్లో ఎన్నికల నేపథ్యంలో మార్చి 22న ఐపీఎల్‌ను ప్రారంభించి.. మే 19న ఫైనల్ మ్యాచ్ నిర్వహించే అవకాశ కనిపిస్తోంది. దీంతో టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఆటగాళ్లకు కనీసం 15 రోజుల విశ్రాంతి లభిస్తుంది. 


Also Read: JC Prabhakar Reddy: ఆ రోజు ఉరి వేసుకుందామనుకున్నా.. సంచలన విషయాలు బయటపెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి  


Also Read: Weather Updates Today: రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి