CSK Vs RCB Match Preview IPL 2024: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రేపటి నుంచి ప్రారంభంకానుంది. సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ వేటను మొదలుపెట్టనుంది. చెన్నైలోని ఎం.చిదంబరం స్టేడియంలో సీఎస్‌కే, ఆర్‌సీబీ జట్ల మధ్య మొదటి మ్యాచ్‌తో మెగా టోర్నీ ఆరంభంకానుంది. ఈ మ్యాచ్‌కు ముందు చెన్నై షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కెప్టెన్‌గా ఎంఎస్ ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేసింది. దీంతో ధోని అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ దిగ్గజ ఆటగాడు టోర్నీ మ్యాచ్‌లు మొత్తం ఆడతాడా..? లేదంటే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉంటాడా..? అనే సందేహం నెలకొంది. అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తొలి టైటిల్ సాధించాలనే పట్టుదలతో సిద్ధమైంది. సీఎస్‌కే, ఆర్‌సీబీ జట్ల హెడ్ టు హెడ్ టు రికార్డులు, స్ట్రీమింగ్ ఎక్కడ ఉంటుంది..? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Rakul Strong Counter: పెళ్లయితే పద్ధతిగా ఉండాలా? అందాలు దాచుకోవాలా? రకుల్‌ ప్రీత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌


ముఖాముఖి పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌దే పైచేయిగా ఉంది. రెండు జట్ల మధ్య 31 మ్యాచ్‌లు జరగ్గా.. ఇందులో చెన్నై 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఆర్‌సీబీ 10 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. చివరి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఆర్‌సీబీపై చెన్నై విజయం సాధించింది. ఆర్‌సీబీ బ్యాటింగ్ విభాగంలో బలంగా కనిపిస్తుండగా.. బౌలింగ్ విభాగం ఆందోళనకరంగానే ఉంది. నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం పెద్ద మైనస్. కామెరాన్ గ్రీన్‌ రూపంలో స్టార్ ఆల్‌రౌండర్ జట్టులో చేరడం కలిసొచ్చే అంశం. ఇక కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో చెన్నై జట్టు ఎలా ఆడుతుందో చూడాలి. కివీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ రచిన్ రవీంద్ర ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాడు. అన్ని విభాగాల్లో చెన్నై బలంగా కనిపిస్తోంది. 


స్ట్రీమింగ్ ఎక్కడ..?


మ్యాచ్: చెన్నై సూపర్ కింగ్స్ VS రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 
ఎప్పుడు: శుక్రవారం రాత్రి 7:30 గంటలకు.
వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం, బెంగళూరు
స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి: JioCinema యాప్


తుది జట్లు ఇలా.. (అంచనా)


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాప్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, కామెరూన్ గ్రీన్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేసాయి, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మయాంక్ డాగర్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ సిరాజ్.


చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే/రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోనీ, దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే/ శార్దూల్ ఠాకూర్


CSK vs RCB డ్రీమ్11 టీమ్:


వికెట్ కీపర్: ఎంఎస్ ధోని


బ్యాటర్లు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ (వైస్ కెప్టెన్), రచిన్ రవీంద్ర, ఫాప్ డుప్లెసిస్


ఆల్ రౌండర్లు: గ్లెన్ మాక్స్‌వెల్, రవీంద్ర జడేజా, కామెరూన్ గ్రీన్ 


బౌలర్లు: మహేశ్ తీక్షణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.
 


Also Read: Kidnap Drama: 'ఇది బిగనర్స్‌ మిస్టేక్స్‌ చూసుకోవాలి కదా!'.. బెడిసికొట్టిన యువతి కిడ్నాప్‌ డ్రామా


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter