Qualifier 1  KKR vs SRH Live: అద్భుతమైన ఫామ్‌తో ఐపీఎల్‌ క్వాలిఫయర్‌ 1కు దూసుకొచ్చిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. సంచలన విజయాలతో అగ్రస్థానంలో ఉన్న కోల్‌కత్తా హైదరాబాద్‌పై పూర్తి ఆధిపత్యం సాధించింది. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో సన్‌రైజర్స్‌కు ఏమాత్రం కలిసిరాలేదు. రెండో బంతికే ట్రావెస్‌ హెడ్‌, రెండో ఓవర్‌లో అభిషేక్‌ శర్మ ఔటవడం కలకలం రేపింది. రాహుల్‌ త్రిపాఠి, క్లాసెన్‌ మినహా ఎవరూ బ్యాటింగ్‌లో మెరిపించలేదు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: IPL 2024 RR vs KKR: రాజస్థాన్‌ ఆశలపై నీళ్లు.. వర్షం కారణంగా కేకేఆర్‌తో‌ మ్యాచ్‌ రద్దు


అహ్మదాబాద్‌ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లోటాస్‌ గెలిచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌కు దిగింది. 10.3 ఓవర్లలో 159 పరుగులు చేసి కుప్పకూలింది. ప్రారంభమే హైదరాబాద్‌కు కలిసిరాలేదు. రెండో బంతికే ట్రావిస్‌ హెడ్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆతర్వాత కొద్దిసేపటికే అభిషేక్‌ శర్మ (3) క్యాచ్‌ ఇచ్చేసి వెనక్కి వచ్చాడు. అనంతరం రంగంలోకి దిగిన అభిషేక్‌ శర్మ అద్భుతంగా పోరాడి ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అభిషేక్‌ మైదానంలో నిలబడి 55 పరుగులు సాధించాడు. నితీశ్ కుమార్‌ రెడ్డి (9) కూడా తక్కువ పరుగులే చేశాడు.

షాబాద్‌ అహ్మద్‌, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సన్వీర్‌ సింగ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ డకౌట్‌గా వెనుదిరిగారు. ఈ క్రమంలో హెన్రిచ్‌ క్లాసెన్‌ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. 21 బంతుల్లో అతి కష్టంగా 32 స్కోర్‌ చేశాడు. అబ్దుల్‌ సమద్‌ విలువైన 16 పరుగులు చేశాడు. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ బ్యాటింగ్‌తో కూడా సత్తా చాటాడు.

Also Read: IPL 2024 PBKS vs SRH: హైదరాబాద్‌ తడాఖా.. పంజాబ్‌పై విజయంతో రెండో స్థానానికి సన్‌రైజర్స్‌?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter