IPL 2024, RCB vs KKR Live Score Updates: ఐపీఎల్ లో కింగ్ కోహ్లీ మరోసారి చెలరేగిపోయాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తో జరుగుతున్న మ్యాచ్ లో కేకేఆర్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. మరోవైపు ఇతడికి గ్రీన్, మాక్స్ వెల్ మంచి సహకారం అందించారు. చివర్లో కార్తీక్ మెరుపులు మెరిపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా, రస్సెల్ చెరో రెండు వికెట్లు తీశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సీజన్ లో ఇది పదో మ్యాచ్. టాస్‌ గెలిచిన కోల్‌కతా మెుదట బౌలింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ ఎనిమిది పరుగులకే ఔటయ్యాడు. మరోవైపు గ్రీన్ తో కలిసి కింగ్ కోహ్లీ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. డేంజరస్ గా మారుతున్న ఈ జోడిని రస్సెల్ విడదీశాడు. గ్రీన్ ను బౌల్డ్ చేసి కేకేఆర్ కు బ్రేక్ ఇచ్చాడు. 


కోహ్లీ, కార్తీక్ మెరుపులు


ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మాక్సెవెల్ తో కలిసి రన్స్ ను పెంచాడు కోహ్లీ. మాక్స్ వెల్ ఇచ్చిన క్యాచ్స్ ను కేకేఆర్ ఫీల్డర్లు నేలపాలుచేశారు. అయినప్పటికీ మాక్సీ దానిని ఆశించిన స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 28 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు కోహ్లీ నిలకడగా ఆడాడు. మాక్సీ తర్వాత వచ్చిన పటిదార్, రావత్ కూడా త్వరగానే పెవిలియన్ చేరారు. ఆఖర్లో క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ మెరుపులు మెరిపించాడు. కేవలం 8 బంతుల్లోనే మూడు సిక్సర్లతో 20 పరుగులు చేశాడు. నాటౌట్ గా నిలిచిన విరాట్ 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 83 రన్స్ చేశాడు. 


Also Read:IPL 2024: ఆరెంజ్ లిస్టులో హైదరాబాద్‌ బ్యాటర్.. పర్పుల్ క్యాప్ రేసులో సీఎస్‌కే బౌలర్..


కేకేఆర్ టీమ్
ఫిలిప్‌ సాల్ట్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, శ్రేయాస్‌ అయ్యార్‌(కెప్టెన్), రామ్‌దీప్‌ సింగ్‌, రింకూ సింగ్‌, ఆండ్రే రస్సేల్‌, సునీల్‌ నారినె, మిచెల్‌ స్టార్క్‌, అనుకుల్‌ రాయ్‌, హర్షిత్‌ రానా, వరుణ్‌ చక్రవర్తి
ఆర్సీబీ టీమ్
విరాట్‌ కోహ్లీ, డుప్లెసిస్‌(కెప్టెన్), కామెరూన్‌ గ్రీన్‌, రజత్‌ పాటిదార్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, అనుజ్‌ రావత్‌, దినేశ్‌ కార్తిక్‌, అల్జర్రి జోసెఫ్‌, మయాంక్‌, మహమ్మద్ సిరాజ్‌, యష్‌ దయాల్‌


Also Read: RCB Vs KKR IPL 2024 Updates: టాస్‌ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకున్న కోల్‌కత్తా.. అందరి దృష్టి గంభీర్‌, కోహ్లీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook