Virat Kohli No Ball Issue: విరాట్ కోహ్లీ అవుట్ నిర్ణయంపై నెటిజన్ల ఆగ్రహం, ముదురుతున్న నో బాల్ వివాదం
Virat Kohli No Ball Issue: ఐపీఎల్ 2024 కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. వివాదాస్పద నో బాల్ నిర్ణయం కారణంగా ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అవుట్ అవడం ఇందుకు కారణం..
Virat Kohli No Ball Issue: కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అవుట్ నిర్ణయం వివాదంగా మారి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అంపైర్లు క్లారిటీ ఇచ్చినా నెటిజన్లు ససేమిరా అంటున్నారు. అసలేం జరిగిందో చూద్దాం..
ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ అత్యంత ఆసక్తిగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగులు చేసింది. 223 పరుగులు భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ చివరి వరకూ పోరాడి కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని అవుట్‌గా ప్రకటించిన థర్ అంపైర్ నిర్ణయం వివాదాన్ని రేపుతోంది. విరాట్ కోహ్లీ కూడా తీవ్ర అసహనంతో మైదానం వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివాదాస్పద నో బాల్ నిర్ణయం ఫలితమిది.
హర్షిత్ రాణా స్లో పుల్ టాస్ ఆడే క్రమంలో విరాట్ కోహ్లీ బ్యాట్‌పై అంచుకు తాకిన బాల్ గాల్లోకి లేవడంతో హర్షిత్ రాణా క్యాచ్ తీసుకున్నాడు. అంపైర్ అవుట్ ప్రకటించేశాడు. కానీ విరాట్ కోహ్లీ అది నో బాల్ క్లెయిమ్ చేయడంతో ధర్డ్ అంపైర్ రిప్లై చూసి అవుట్ అనే నిర్ధారించాడు. బంతి బ్యాటర్ నడుము కంటే ఎత్తులో వెళితే నో బాల్‌గా ప్రకటిస్తారు. అయితే ఆ సమయంలో బ్యాటర్ క్రీజులోపలే ఉండాల్సి ఉంటుంది. కానీ విరాట్ క్రీజ్ వెలుపలకు వచ్చి ఆడాడు. దాంతో విరాట్ నడుము కంటే ఎత్తులో బాల్ వచ్చినా అవుట్ ఇవ్వాల్సి వచ్చిందనేది అంపైర్ వివరణగా ఉంది. ఒకవేళ క్రీజ్‌లో ఉన్నా బంతి విరాట్ కోహ్లీ నడుము కంటే తక్కువ ఎత్తులోనే వెళ్లుతున్నట్టుగా సాంకేతికత సహాయంతో బంతి దిశను బట్టి అంపైర్ అంచనా వేశాడు.
ఇదే విషయం విరాట్ కోహ్లీకు అంపైర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా కోహ్లీ శాంతించలేదు. ఆ తరువాత డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా విరాట్‌ను ఆపి ఆంపైర్ అవుట్ గురించి పూర్తిగా వివరించాడు. ప్రస్తుతం నో బాల్ వివాదం, విరాట్ కోహ్లీ అసహనం, అంపైర్ నచ్చజెప్పడం అన్నీ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు మాత్రం ఇది అవుట్ కాదనే అంటున్నారు. మొత్తానికి నో బాల్ వివాదం ఆర్సీబీ కొంప ముంచిందనే చెప్పవచ్చు
Also read: RCB vs KKR Highlights: ఆర్సీబీ ఏడో ఓటమి.. ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook