IPL Eliminator Match: ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు లక్నో ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. లక్నో బ్యాట్స్‌మ్యాన్ రజత్ పటీదార్ చెలరేగి ఆడి అజేయ సెంచరీ సాధించాడు. వన్ డౌన్‌లో వచ్చిన రజత్ 7 సిక్సులు, 12 ఫోర్లతో కేవలం 54 బంతుల్లోనే 112 పరుగులు చేశాడు. రజత్ సెంచరీ ఇన్నింగ్స్‌తో బెంగళూరు భారీ స్కోర్ చేయగలిగింది. దినేశ్ కార్తీక్ 37 పరుగులతో రాణించాడు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి బెంగళూరును బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. తొలి ఓవర్ చివరి బంతికి కెప్టెన్ డుప్లెసిస్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కోహ్లి-రజత్ పటీదార్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ (9), లోమ్రోర్ (14) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. రజత్ పటీదార్ తన దూకుడు కొనసాగించాడు. చివరలో దినేశ్ కార్తీక్ రజత్‌కు చక్కని సహకారం అందించాడు.


తాజా ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచే జట్టు క్వాలిఫయర్-2లో రాజస్తాన్‌ జట్టుతో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలుపొందే జట్టు ఫైనల్ చేరుతుంది. ఆడిన తొలి సీజన్‌లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటికే ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. లక్నోకి కూడా ఇదే తొలి ఐపీఎల్ సీజన్. ఈ మ్యాచ్‌లో లక్నో బెంగళూరును ఓడిస్తుందా లేక చతికిలపడుతుందా చూడాలి. 


Also Read: Athmakur By Election 2022: ఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ...


Also Read: Venu Rahu Combination: రాహువు, శుక్ర కలయిక జాతకంలో బలంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా... 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి