IPL 2022 LSG vs RCB Eliminator: ఐపీఎల్ 2022లో భాగంగా మరికొద్దిసేపట్లో మెగా ఫైట్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకుంది. లక్నో రెండు మార్పులతో బరిలోకి దిగింది. కృష్ణప్ప గౌతమ్, జేసన్ హోల్డర్ స్థానంలో కృనాల్ పాండ్యా, దుష్మంత చమీర ఆడుతున్నారు. మరోవైపు మహమ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్ ఆడుతున్నాడని బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్ చెప్పాడు.
వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ ఆలస్యమైంది. వర్షం ఆగిపోయిన తర్వాత టాస్ వేశారు. దాదాపుగా 45 నిమిషాల లేటుగా మ్యాచ్ ఆరంభం అయింది. ఎలిమినేటర్ మ్యాచ్ కాబట్టి ఓవర్లను కుదించలేదు. అయితే వరణుడు కరుణించడంతో బెంగళూరు ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ జరగ్గపోయి, సూపర్ ఓవర్ కూడా పడకపోతే.. బెంగళూరు ఇంటికి వెళ్లాల్సి వచ్చేది. వరణుడు కరుణించడంతో టాస్ పడి మ్యాచ్ జరుగుతోంది. 'వరణుడు కరుణించే.. టాస్ పడే', 'బెంగళూరుకి అదృష్టం బాగానే ఉంది సుమీ' అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో లక్నో, నాలుగు స్థానంలో బెంగళూరు ఉన్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన టీమ్ ఐపీఎల్ 2022 నుంచి నిష్క్రమిస్తుంది. అందుకే ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడాల్సి ఉంటుంది. అక్కడ గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.
🚨 Team News 🚨
2⃣ changes for @LucknowIPL as Krunal Pandya & Dushmantha Chameera are named in the team.
1⃣ change for @RCBTweets as Mohammed Siraj is picked in the team.
Follow the match ▶️ https://t.co/cOuFDWIUmk #TATAIPL | #LSGvRCB
A look at the Playing XIs 👇 pic.twitter.com/nQTg14f2Nz
— IndianPremierLeague (@IPL) May 25, 2022
తుది జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, మనన్ వోహ్రా, మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్యా, దుష్మంత చమీర, మొహ్‌సిన్ ఖాన్, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, వానిందు హసరంగ, జోష్ హాజిల్‌వుడ్, మహమ్మద్ సిరాజ్.
Also Read: Viral Photo: ఇదేందయ్యో ఇది.. నేనెక్కడా చూడలే! పెళ్లి బ్యానర్‌లో ఇద్దరు వధువుల పేర్లు
Also Read: లైఫ్‌లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు.. ఎన్నో వదులుకొని ఇక్కడికొచ్చా: నాగ చైతన్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి