IPL 2020 Venue:  ఐపిఎల్ 2020 ఎక్కడ నిర్వహించాలనే విషయంలో బీసీసీఐనే ( BCCI ) ఇంకా ఓ స్పష్టతకు రాలేదు కానీ.. ఐపిఎల్ ఫ్రాంఛైజీలు మాత్రం అప్పుడే అబుదాబిలో ఐపిఎల్ నిర్వహణకు ఎర్పాట్లు చేసుకుంటున్నారు. టీ20 వరల్డ్ కప్ ( T20 World Cup ) ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంలో ఐసిసి ( ICC ) ఓ ప్రకటన చేస్తే... ఆ తర్వాత  ఐపిఎల్ టోర్నమెంట్‌ని ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనేది ఓ నిర్ణయం తీసుకోవచ్చని బీసీసీఐ వేచిచూస్తోంది. కానీ అంతకంటే ముందే ఐపిఎల్ ఫ్రాంఛైజీలు మాత్రం అబుదాబిలోని స్టార్ హోటల్స్‌తో, స్పెషల్ ఛార్టెడ్ ప్లేన్స్ అద్దెకు ఇచ్చే ఏవియెషన్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. అవును.. ఇదంతా నిజమే.. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఐపిఎల్ ఫ్రాంచైజీ సిబ్బంది ఐఏఎన్ఎస్‌తో స్వయంగా చెప్పిన విషయం ఇది. తమకు అందుబాటులో ఉన్న స్పష్టమైన సమాచారం మేరకే తాము ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సదరు ఫ్రాంచైజీ సిబ్బంది చెప్పినట్టు ఐఏఎన్ఎస్ పేర్కొంది. ( Also read: IPL 2020: ఐపిఎల్ 2020 నిర్వహణపై స్పందించిన న్యూజిలాండ్‌ )


బీసీసీఐ అంగీకరిస్తే.. ఐపిఎల్ నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని యూఏఈ, శ్రీలంక నుంచి ప్రతిపాదనలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఐపిఎల్ ఎక్కడ నిర్వహించాలనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం టీ 20 ప్రపంచ కప్‌పై ఐసిసి ఏం చెబుతుందా అనే వివరాల కోసమే బిసిసిఐ వేచిచూస్తోంది. ( Also read: Notice to Twitter: ట్విటర్‌కి భారత్ నోటీసులు )