IPL 2020: ఐపిఎల్ 2020 నిర్వహణపై స్పందించిన న్యూజిలాండ్‌

IPL 2020 updates: ఐపిఎల్ 2020 టోర్నమెంట్‌ను న్యూజీలాండ్‌లో నిర్వహించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు ముందుకొచ్చిందని బీసీసీఐ ( BCCI ) చెబుతున్నప్పటికీ.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ( NZC ) మాత్రం అందుకు విరుద్ధమైన ప్రకటన విడుదల చేసింది.

Last Updated : Jul 9, 2020, 08:25 PM IST
IPL 2020: ఐపిఎల్ 2020 నిర్వహణపై స్పందించిన న్యూజిలాండ్‌

IPL 2020 updates: ఐపిఎల్ 2020 టోర్నమెంట్‌ను న్యూజీలాండ్‌లో నిర్వహించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు ముందుకొచ్చిందని బీసీసీఐ ( BCCI ) చెబుతున్నప్పటికీ.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ( NZC ) మాత్రం అందుకు విరుద్ధమైన ప్రకటన విడుదల చేసింది. ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2020కి ( IPL 2020 ) ఆతిధ్యమిచ్చేందుకు న్యూజిలాండ్ క్రికెట్ ముందుకొచ్చినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి రిచర్డ్ బూక్ ( Richard Boock ) ప్రకటించారు. న్యూజిలాండ్‌లో ఐపిఎల్ నిర్వహించేందుకు తాము ఆసక్తి కనబర్చలేదు సరికదా.. తమవైపు నుంచి అసలు అటువంటి ప్రయత్నం ఏదీ జరగనేలేదని రిచర్డ్ బూక్ స్పష్టంచేశాడు. రేడియో న్యూజీలాండ్‌తో మాట్లాడుతూ బూక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. Asia Cup 2020: ఆసియా కప్ రద్దు: గంగూలీ )

కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి కారణంగా ఈ ఏడాది మార్చి నెలలోనే జరగాల్సి ఉన్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ ( IPL ) నిరవధిక వాయిదా పడుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఐపిఎల్‌ను భారత్‌లో కాకుండా బయటి దేశాల్లో నిర్వహించేందుకు సిద్ధమైతే.. అందుకు ఆసక్తి చూపిస్తున్న దేశాల్లో యూఏఈ, శ్రీలంకతో ( UAE, Sri lanka ) పాటు న్యూజీలాండ్ ( New Zealand ) కూడా వచ్చి చేరిందని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పిన అనంతరం న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు నుంచి ఈ స్పందన రావడం గమనార్హం. Bio-bubble: బయోబబుల్ అంటే ఏంటి? ఆటగాళ్లు పూర్తిగా సురక్షితమా ? )

ఇప్పటివరకు రెండు సందర్భాల్లో మాత్రమే ఐపిఎల్ టోర్నమెంట్‌ను భారత్‌లో కాకుండా బయటిదేశాల్లో నిర్వహించారు. అందులో ఒకటి ఐపిఎల్ 2009 ( IPL 2009 ) సీజన్ కాగా మరొకటి ఐపిఎల్ 2014 ( IPL 2014 ). 2009లో సౌతాఫ్రికాలో ( South Africa ) ఐపిఎల్ నిర్వహించగా 2014లో యూఏఈలో ఐపిఎల్ టోర్నమెంట్ జరిగింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x