IPL KKR vs RR: బట్లర్ విధ్వంసంతో రాజస్థాన్ అద్భుత విజయం..నరైన్ శతకం వృథా
IPL Live Score 2024 KKR vs RR Sunil Narine Century Kolkata Knight Riders Victory: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్ల మధ్య జరిగిన పోరులో సునీల్ నరైన్ అద్భుత పోరాటం చేసినా కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు పరాజయం తప్పలేదు. జోస్ బట్లర్ అజేయ శతకంతో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం పొందింది.
KKR vs RR Highlights: ఈ సీజన్‌లో దూకుడు ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్న కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ పై రాజస్థాన్ రాయల్స్ పైచేయి సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఆఖరి బంతిలో 2 వికెట్ల పరుగుల తేడాతో రాజస్థాన్ ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తిరుగులేని విజయాలతో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్‌కు పరాభవం ఎదురైంది.
Also Read: IPL RCB vs SRH Highlights: ఐపీఎల్ చరిత్రలోనే హైదరాబాద్ భారీ విజయం.. బెంగళూరు చెత్త ప్రదర్శన
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ పోరాడి గెలిచింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన రాజస్థాన్ పవర్‌ప్లేలో సత్తా చాటింది. ఆ తదనంతరం మిడిలార్డర్ తడబడింది. కానీ ప్రారంభం నుంచి దూకుడు మొదలుపెట్టిన జోస్ బట్లర్ బ్యాటింగ్‌తో బీభత్సం సృష్టించాడు. జట్టు కష్టకాలంలో బట్లర్ అద్భుతంగా పోరాడి ఆఖరి బంతికి విజయం అందించాడు. 60 బంతుల్లో 107 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. 9 ఫోర్లు, 6 సిక్సర్లతో రెచ్చిపోయాడు. యశస్వి జైస్వాల్ (19) తక్కువ స్కోర్‌కే మైదానం వీడగా జోస్ బట్లర్ అద్భుతంగా పోరాడాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (12) స్కోర్ సాధించడంలో విఫలమయ్యాడు. రియాన్ పరాగ్ (34) దూకుడుగా ఆడుతూ జట్టును విజయం కోసం శ్రమించాడు. రవిచంద్రన్ అశ్విన్ (8), ధ్రువ్ జురేల్ (2), షిమ్రన్ హెట్‌మెయిర్ డకౌట్‌గా వెనుతిరిగారు.
భారీ లక్ష్యం సాధించి కోల్‌కత్తా బ్యాటింగ్‌లో రాజస్థాన్‌ను అడ్డుకట్ట వేయలేకపోయింది. బ్యాటర్లు ఉంచిన భారీ స్కోర్‌ను కాపాడలేకపోయారు. హర్షిత్ రానా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. వైభవ్ అరోరా ఒక వికెట్ తీశాడు. బౌలింగ్‌లో సత్తా చాటినా కూడా జోస్ బట్లర్‌ను ఔట్ చేయలేకపోవడంతో రాజస్థాన్ మ్యాచ్‌ను చేజార్చుకోవాల్సి వచ్చింది. బట్లర్ వికెట్ పడగొట్టకపోవడం ఆర్‌ఆర్ పరాజయానికి ప్రధాన కారణం.
Also Read: IPL Live MI vs CSK Highlights: పతిరణ దెబ్బకు ముంబై ఇండియన్స్ విలవిల.. చెన్నై భారీ విజయం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు సాధించింది. సునీల్ నరైన్ మరోసారి బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. 56 బంతుల్లో 109 పరుగులు చేసి అజేయ శతకం సాధించాడు. 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో నరైన్ వీర విహారం చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కుదిగిన అంగ్‌క్రిష్ రఘువంశీ (30), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (11), ఆండ్రె రసెల్ (13), రింకూ సింగ్ (20), వెంకటేశ్ అయ్యర్ (8) బ్యాట్‌తో కొన్ని పరుగులు రాబట్టి రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం ఉంచారు. బౌలింగ్‌కు దిగిన రాజస్థాన్ బౌలర్లు సునీల్ నరైన్ బ్యాటింగ్ విధ్వంసాన్ని నియంత్రించలేకపోయింది. అవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ రెండు చొప్పున వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చాహల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter